Prashanth Neel: ప్రశాంత్ నీల్.. ‘కేజిఎఫ్’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్గా గుర్తింపు సొంతం చేసుకున్న ఈయన.. ‘సలార్’ సినిమాతో మరో రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR)తో ‘డ్రాగన్ ‘ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈరోజు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో బాగానే ప్రశాంత్ నీల్ కి ఒక అరుదైన సమస్య ఉందని, ఆ కారణంగానే ఆయన చిత్రాలన్నీ కూడా డార్క్ గా ఉంటాయని, అటు హీరోలని కూడా ఆయన డార్క్ గానే చూపిస్తారని సమాచారం. మరి తనకున్న సమస్యపై ప్రశాంత్ నీల్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.
అలాంటి సమస్యతో బాధపడుతున్న ప్రశాంత్ నీల్..
గతంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరైన ప్రశాంత్ నీల్ తన సినిమాల గురించి అలాగే తనకున్న సమస్య గురించి చెప్పుకొచ్చారు. మీ సినిమాలన్నీ ఎందుకు డార్క్ షేడ్ లోనే ఉంటాయి? కలర్ఫుల్ గా ఎందుకు ఉండవు? అని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. నాకు ఓసీడీ అనే సమస్య ఉంది. అందుకే ఎక్కువ కలర్స్ ఉంటే నాకు నచ్చదు. నా పర్సనల్ థాట్స్ అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకే నా సినిమాలన్నీ ఎప్పుడు కూడా అలానే ఉంటాయి. కానీ నా సినిమాలకు ఒకదానికొకటి సంబంధం ఉండదు అంటూ క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కి ఉన్న ఈ సమస్య తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఘనంగా ప్రశాంత్ నీల్ బర్త్ డే సెలబ్రేషన్స్..
ఇకపోతే ఈరోజు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు కావడంతో డ్రాగన్ సినిమా టీం తోనే ఆయన తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న ‘డ్రాగన్’ మూవీ హీరో ఎన్టీఆర్ సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ప్రశాంత్ నీల్ . ఇకపోతే ఐపిఎల్ వేడుకలలో భాగంగా 18 ఏళ్ల తర్వాత ట్రోఫీని సొంతం చేసుకుంది ఆర్సిబి. ఈ క్షణం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఆర్సిబి విన్నింగ్ కోసం ఎంతగానో ఎదురు చూసిన
ప్రశాంత్ కూడా ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆనందంతో పొంగిపోయారు. చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశారు. ఇక ఆ సందర్భంలోనే తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి మరీ ఆనందాన్ని తెలియపరిచారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కి సంబంధించిన ఈ వీడియోను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా .. పలువురు సెలబ్రిటీలు , అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ALSO READ:Bahubali Re release: ఇది కదా అసలైన రీ రిలీజ్ అంటే.. అసలు ట్విస్ట్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు!