Karnataka CM: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర… తీవ్ర తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన నేపథ్యంలో… కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. కీలక ప్రకటన చేశారు. ఈ చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించారు. అలాగే మృతుల కుటుంబాలకు భారీ నష్టపరిహారం ప్రకటించారు సీఎం సిద్ధరామయ్య. ఒక్క కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు తాజాగా వెల్లడించారు. ఇక గాయపడ్డ వారికి… కూడా మెరుగైన వైద్యంతో పాటు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.
ALSO READ: Anushka Sharma-Virat Kohli: 18 ఏళ్ళ తర్వాత కప్.. అనుష్కకు టైట్ హాగ్ ఇచ్చి.. ఏడ్చేసిన కోహ్లీ
చిన్న స్వామి స్టేడియానికి దాదాపు 3 లక్షల మంది జనం ఒక్కసారిగా రావడంతో తొక్కిసేలాట జరిగిందని ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆనంద సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమంటూ ఎమోషనల్ అయ్యారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగిందని గుర్తు చేశారు. చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అలాగే తొక్కిసలాటలో 33 మందికి తీవ్ర గాయాలు అయ్యాయని… వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సంఘటనపై… విచారణ కూడా చేయిస్తామని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన
చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా… స్పందించారు. ఈ ఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన… గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగే మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఇస్తున్నట్లు వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ.
ALSO READ: RCB Maiden IPL Trophy: 18 ఏళ్ల నిరీక్షణ… ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా RCB… ప్రైజ్ మనీ ఎంతంటే
కోహ్లీని వెంటనే అరెస్టు చేయాలి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన నేపథ్యంలో… వెంటనే విరాట్ కోహ్లీ ని అరెస్టు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టులు పెడుతున్నారు. విరాట్ కోహ్లీని అరెస్టు చేసి వెంటనే బొక్కలో వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంధ్య థియేటర్ సంఘటనలో అల్లు అర్జున్ ను అరెస్టు చేసినట్లుగానే… విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలని అంటున్నారు. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించి…. బాధిత కుటుంబాన్ని కూడా విరాట్ కోహ్లీ ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. తరహా లోనే వెంటనే విరాట్ కోహ్లీని కూడా అరెస్టు చేయాలని కర్ణాటక ప్రభుత్వం పై ఒత్తిడులు వస్తున్నాయి. విరాట్ కోహ్లీని అరెస్టు చేయకపోతే.. పూర్తి బాధ్యత కర్ణాటక ప్రభుత్వం వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.