BigTV English

UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..

UPSC Recruitment: గోల్డెన్ ఛాన్స్.. యూపీఎస్సీలో 752 ఉన్నత ఉద్యోగాలు.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..

UPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉన్నత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలు చేసింది.


*కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీస్, స్టాటిస్టికల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ లో 705 ఉద్యోగాలు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ లో 35 ఉద్యోగాలు, ఇండియన్ ఎకానమిక్ సర్వీస్ లో 12 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.


ALSO READ: Indian Navy Jobs: ఇండియన్ నేవిలో 270 ఉద్యోగాలు.. రేపే లాస్ట్..!

కంబైన్డ్ మెడికల్ సర్వీస్ లో 705 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయితే జూనియర్ మెడికల్ ఆఫీసర్ హోదాతో సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో సీనియర్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఆపై స్థాయికి కూడా చేరవచ్చు.

విద్యార్హత: ఎంబీబీఎస్ పాసై ఉండాలి. ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్ల వయస్సు మించరాదు.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్ డే పరీక్ష 500 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 250 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో పేపర్ లో 120 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ కు 2 గంటల సమయం ఇస్తారు. ప్రశ్నలు అబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/2 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

ఎగ్జామ్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూను 100 మార్కులకు కేటాయిస్తారు.

దరఖాస్తుకు చివరితేది: 2025 మార్చి 11

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష రాయవచ్చు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వైజాగ్, తిరుపతి

……………………………………………………………………………………………..

ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ లో 35 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*జూనియర్ టైమ్ స్కేల్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతోంది. నేషనల్ స్టాటిస్టికల్, సెంట్రల్ స్టాటిస్టకల్, నేషనల్ శాంపిల కార్యాలయాల్లో విధులుంటాయి. ఫ్యూచర్ లో సీనియర్, చీఫ్ ఆఫీసర్ హోదాలు దక్కుతాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: పరీక్షలో రెండు భాగాలుంటాయి. పార్ట్-1 లో భాగంగా 6 పేపర్లు ఉంటాయి. వెయ్యి మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ ఒక్కో పేపర్ వంద మార్కులకు నిర్ణయిస్తారు. ఒక్కో పేపర్ వ్యవధి 3 గంటల సమయం ఉంటుంది. స్టాటిస్టిక్స్ పేపర్ 1, 2 ఆబ్జెక్టివ్ తరహాలో వస్తాయి. ఒక్కో పేపర్ వ్యవధికి 2 గంటల సమయం ఉంటుంది.

స్టాటిస్టిక్స్‌ 3, 4 పేపర్లు డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్‌ కు 3 గంటల సమయం ఉంటుంది. ఒక్కో స్టాటిస్టిక్స్‌ పేపరు (1,2,3,4)కు 200 మార్కులు ఉంటుంది. స్టాటిస్టిక్స్‌ 1, 2 పేపర్లలో 80 చొప్పున ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండున్నర మార్కులు కేటాయిస్తారు. డిస్క్రిప్టివ్‌ తరహాలో ఉన్న 3, 4 పేపర్లలో సగం ప్రశ్నలు షార్ట్‌ ఆన్సర్ రూపంలో వస్తాయి. మిగిలిన సగంలో లాంగ్‌ ఆన్సర్, కాంప్రహెన్షన్‌ ప్రాబ్లమ్‌ ప్రశ్నలు ఉంటాయి.

– పేపర్ ఇంగ్లిష్ లో ఉంటుంది. ఇంగ్లిష్ లోనే ఆనర్లు రాయాల్సి ఉంటుంది.

* పార్ట్-1 అర్హత సాధిస్తేనే పార్ట్-2లో భాగంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అబ్జెక్టివ్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

* పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

విద్యార్హత: స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ వీటిలో ఎందులోనైనా యూజీ/ పీజీ ఉండాలి. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సుల్లో ఉన్నవారూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

…………………………………………………………………………

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ లో 12 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: ఎకనామిక్స్‌/ అప్లైడ్‌ ఎకనామిక్స్‌/ బిజినెస్‌ ఎకనామిక్స్‌/ ఎకనోమెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ పూర్తిచేసినవారు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థులు వయస్సు 21 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉండాలి. 1995 ఆగస్టు 2 నుంచి 2004 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు ఉద్యోగానికి అర్హులవుతారు.

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 4

ఎగ్జామ్స్: జూన్ 20 నుంచి ఉంటాయి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://upsc.gov.in/

ALSO READ: SBI Recruitment: శుభవార్త.. SBIలో 1194 ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!

అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×