BigTV English

Swiggy Gold Delivery: స్విగ్గీలో బంగారం డెలివరీ.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్‌తో.. నిజమా?

Swiggy Gold Delivery: స్విగ్గీలో బంగారం డెలివరీ.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్‌తో.. నిజమా?

Swiggy Gold Delivery| ఇప్పుడు అంతా ఈ కామర్స్ జమానా. కాదు కాదు.. క్విక్ కామర్స్ జమానా. ఏది కావాలన్నా ఇంటి ముందు క్షణాల్లో డెలివరీ జరుగుతుంది. అందుకే ఈ ఇన్‌‌స్టెంట్ డెలివరీ యాప్స్ కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఈ ఇన్‌స్టెంట్ డెలివరీ యాప్స్ 10 నిమిషాల్లో ఏది కావాలన్నీ అత్యంత వేగంగా డెలివరీ చేస్తున్నారు. పైగా డెలివరీ ఐటెమ్స్ జాబితాలో కూడా ఊహించని ఐటెమ్స్ జోడిస్తూ వెళుతున్నారు. బంగారం కూడా ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకు డెలివరీ చేస్తున్నట్లు ఒక వీడియో ద్వారా తెలిసింది.


తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డెలివరీ బాయ్ బైక్ పై ఏదో డెలివరీ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఆ డెలివరీ బాయ్ వెనుక కూర్చొని ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఒక సెక్యూరిటీ గార్డ్ దుస్తులు ధరించి ఉన్నాడు. పైగా తన చేతుల్లో ఒక లాకర్ బాక్స్ పట్టుకొని కూర్చున్నాడు. అందులో బంగారం ఉందని.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. అక్షయ తృతీయ సందర్భంగా తమ కస్టమర్లకు బంగారం డెలివరీ చేస్తోందని.. అది కూడా కస్టమర్ల బంగారాన్ని ఎవరూ దోచుకోకుండా ఫుల్ సెక్యూరిటీతో డెలివరీ చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ పై తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియో, ఫోటోలతో పోస్ట్ లు పెట్టగా.. స్వయంగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వాటిని రీ షేర్ చేసింది. ఆ పోస్ట్ లలో ఒక యూజర్ ప్రశ్నిస్తూ.. ఒక స్టోరీ రాశాడు. “ఏం జరుగుతోంది ఇన్‌స్టామార్ట్?” అని అడిగాడు. దానికి స్విగ్గీ సమాధానమిస్తూ “రియల్ గోల్డ్ డెలివరీ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా బ్రో” అని బదులిచ్చింది.


Also Read: చోరీ కారును ఓనర్‌కే విక్రయించిన దొంగలు.. కారు నెంబర్ మార్చినా ఎలా గుర్తు పట్టాడంటే?

ఇలాగే మరో యూజర్ వీడియో పోస్ట్ చేయగా.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ స్పందిస్తూ.. “డెలివరింగ్ సోనా ఇన్ ఎవెరీ కోనా కోనా (బంగారం దేశంలోని నలుమూలల డెలివరీ చేస్తున్నాం)” అని రెస్పాన్స్ ఇచ్చింది. వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ టీ షర్ట్ వేసుకున్న ఒక డెలివరీ బాయ్ బైక్ ముందు భాగంలో కూర్చొని రైడ్ చేస్తుండగా.. బైక్ పై వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్ కూర్చొని ఒక సెక్యూరిటీ లాకర్ బాక్స్ పట్టుకొని ఉన్నాడు. ఆ లాకర్ బాక్సు పై ఇన్‌స్టామార్ట్ స్టికర్ కూడా కనిపిస్తోంది. పైగా ఆ సెక్యూరిటీ గార్డ్ మరో చేతిలో ఒక లాఠీ పట్టుకొని ఉన్నాడు. ఈ వీడియోని నెటిజెన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. చాలా మంది ఇది చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు. “ఒకరైతే ఏదో సెక్యూరిటీ గార్డ్ కు ఆ డెలివరీ బాయ్ లిఫ్ట్ ఇస్తున్నాడు అనుకున్నా.. ఇంత సీనుందా?” అని సరదాగా కామెంట్ పెట్టాడు.

ఇంకొక యూజర్ అయితే బంగారం డెలివరీకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ బ్రో అని కామెంట్ చేశాడు. అంతా బాగుంది కానీ.. నిజంగానే బంగారం ఇంటికి డెలివరీ చేస్తున్నట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అధికారికంగా ప్రకటించలేదు. కేవలం సరదా పోస్ట్ లు మాత్రమే పెట్టింది.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×