రివ్యూ : ఔసెప్పింటే ఒసియాతు మలయాళ మూవీ
నటీనటులు : విజయరాఘవన్, దిలీష్ పోతన్, కలభవన్ షాజోన్, హేమంత్ మీనన్, లెనా, కని కుసృతి, జరీన్ షిహాబ్, అంజలి
దర్శకుడు : శరత్ చంద్రన్ ఆర్జే
రన్ టైమ్ : 1 గంట 59 నిమిషాలు
జానర్ : ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ : అమెజాన్ ప్రైమ్ వీడియో (మలయాళం)
Ouseppinte Osiyathu Movie Review : సీనియర్ మలయాళ నటుడు విజయరాఘవన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఔసెప్పింటే ఒసియాతు’ మూవీ థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. దిలీష్ పోతన్, కని కస్రుతి, జరీన్ షిహాబ్ కీలక పాత్రలు పోషించిన ఈ మలయాళ చిత్రం ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అది కూడా రెంట్ బేసిస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శరత్ చంద్రన్ దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీ మార్చి 7న థియేటర్లలో విడుదల కాగా, మే 1న ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మలయాళంలో మాత్రమే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
ఈ సినిమా బంధాలు, బంధుత్వాల ప్రాముఖ్యత, ఊహించని విషాదం ఒక కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాల ఆధారంగా తెరకెక్కింది. ఔసెప్ (విజయరాఘవన్) కుటుంబ పెద్ద. అతనికి ముగ్గురు కొడుకులు మైకేల్ (దిలీష్ పోతన్), జార్జ్ (కలభవన్ షాజోన్), రాయ్ (హేమంత్ మీనన్) ఉంటారు. మైకేల్ ఒక తహసీల్దార్, జార్జ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్, రాయ్ సామాజిక కార్యకర్త. ఇలా ముగ్గురూ మూడు విభిన్న పనులు చేస్తూ ఉంటారు. అయితే కుటుంబం మాత్రం ఔసెప్ సోదరుడి సంపదపై ఆధారపడుతుంది. ఒక అనూహ్య సంఘటన కుటుంబాన్ని ఏ పెద్ద సమస్యలో పడేస్తుంది, దీనిని దాచడానికి ముగ్గురు సోదరులు కలిసి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ముగ్గురు అన్నదమ్ముల మధ్య బంధం ఎంత స్ట్రాంగ్, హానెస్ట్, గత గాయాలు వంటి విషయాలన్నీ బయట పడతాయి. అసలు ఈ ముగ్గురు అన్నదమ్ములకు వచ్చిన సమస్య ఏంటి? దాన్ని ఫ్యామిలీ నుంచి ఎందుకు దాచాలి అనుకున్నారు? చివరికి ఆ సమస్యను ఎలా పరిష్కరించారు? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
కుటుంబ బంధాలు, సోదరుల మధ్య బాధ్యతలు, బాల్య గాయాల ప్రభావం వంటి లోతైన అంశాలను సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు. అయితే ఇనిమాలో యాక్షన్, కామెడీ వంటి ఎంటర్టైనింగ్ అంశాలు లేకపోవడం వల్ల మూవీ థియేటర్లలో సక్సెస్ కాలేదు. రెండవ భాగం కొంత హడావిడిగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఒక ఇన్వెస్టిగేటివ్ బృందం కథలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు. క్లైమాక్స్ నిరాశపరుస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్, సంగీతం కథలో ఎమోషనల్ సీన్స్ కు మరింత డెప్త్ ను జోడించింది. ఇక సినిమాలో ఒకే ఒక్క పాట ఉన్నప్పటికీ అది అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సినిమాటోగ్రఫర్ అరవింద్ కన్నబీరన్ ఈడుక్కి జిల్లా (పీరుమేడు, కట్టప్పన) లోని పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని, రాత్రి సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. దిలీష్ పోతన్ మైకేల్ పాత్రలో తన నటనతో మెప్పిస్తాడు, ముఖ్యంగా రెండవ భాగంలో అతని ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కలభవన్ షాజోన్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.. విజయరాఘవన్ పరిమిత పాత్రలో కూడా తనదైన ముద్ర వేశాడు. కని కుసృతి పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే, బ్రదర్స్ సైకలాజికల్ స్థితిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
పాజిటివ్స్:
కథ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
నటీనటుల నటన
నెగెటివ్స్:
క్లైమాక్స్
ద్వితీయార్థం
చివరగా
ఎమోషనల్ డ్రామాలు, సస్పెన్స్ కథాంశాలు ఇష్టపడే వాళ్లకే ఈ మూవీ. కానీ తెలుగులో అందుబాటులో లేదు. సినిమాలో నటన, విజువల్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి కొంత నిరాశ తప్పదు.
Ouseppinte Osiyathu Movie Rating : 1.5/5