Illu Illalu Pillalu Today Episode june 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రామారాజు మిల్లుకు రమ్మని చెప్తాడు. నేను రాను అని ఎదురిస్తాడు. ఇంట్లో పెద్ద ధీరజ్ ఒకసారి ఆయన మిల్లుకు రావాలి అంటాడు. మరొకసారి నాకు నీకు ఏ సంబంధం లేదు నువ్వు సంపాదించి ఇవ్వాలి అని అంటాడు. ఇలా ఒక్కసారి రెండుసార్లు అంటే పర్వాలేదు కానీ ప్రతిసారి ఇలా అంటూ ఉంటే ఎలా ఆయన మాటను వినాలి అన్నయ్య. నాక్కూడా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది కదా అని ధీరజ్ అనగానే అన్నదమ్ములు నీ ఇష్టం రాని వదిలేస్తారు. ఇక వేదవతి తండ్రి కొడుకులను ఒకచోట చేర్చి కలపాలని ప్లాన్ వేస్తుంది. ప్రేమ కూడా సపోర్ట్ చేస్తుంది.. తండ్రి కొడుకులు కలిసి భోజనం చేస్తే కోపం తగ్గిపోతుందని అనుకుంటుంది వేదవతి.. ప్రేమ, వేదవతి కలిసి ఇద్దరినీ భోజనం దగ్గర కూర్చోబెడతారు. కానీ రామరాజు భోజనం నుంచి మధ్యలోనే వెళ్ళిపోతాడు.. అయితే వేదవతి ధీరజ్ కు నిజం చెప్పాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ వాళ్ళ నాన్న అన్న మాటలు విని బాధపడుతూ ఉంటాడు. వీడు ఇలా బాధపడడానికి కారణం నేనే వీడి బాధను ఎలాగైనా పోగొట్టాలని ప్రేమ అనుకుంటుంది.. మీ నాన్నన్న మాటలకి బాధపడుతున్నావా అని ప్రేమ అడుగుతుంది. మా నాన్న అనడం కొత్త కాదు పడటం నాకు కొత్త కాదు బాధ ఏమీ లేదు అని అంటాడు. అయితే ప్రేమ మాత్రం నీకు ఒక కథ చెప్తాను వింటావా అని అడుగుతుంది. ఈ టైంలో కథల దేవుడా అనేసి ధీరజ్ అనుకుంటాడు. కానీ ప్రేమ మాత్రం మా నానమ్మ చెప్పిన కథ వినరా అని బెదిరిస్తుంది. దేవుడు గురించి రాయి శిల్పంగా మారడం గురించి గొప్ప నీతి కథను ధీరజ్ చెప్తుంది.
ఈ కథ నాకు చాలా మంది చెప్పారు నేను చాలాసార్లు విన్నాను కానీ ఇప్పుడు క్లాస్ తీసుకోవడం ఆపేసేయ్ అనేసి ధీరజ్ ప్రేమకు పంచు వేస్తాడు. నేను ఇంత మంచి కథ చెప్తే నువ్వు నన్ను ఇలా అంటావా అని ప్రేమ ధీరజ్ ని కొడుతుంది. అన్ని బాగానే ఉంటాయి జీవితంలోనే ఏవి బాగా ఉండవు అనేసి ధీరజ్ అంటాడు. అటు నర్మదా ఎక్కడ ఉందో అని సాగర్ వెతుకుతూ ఉంటాడు. నర్మదా ఒకచోట కూర్చొని చేతిలో వాచి పట్టుకుని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాగరు ఏమైంది మా నాన్న ఏమైనా మళ్లీ నిన్న అన్నాడా అని అడుగుతాడు.
అదేం కాదు అని నర్మదా అంటుంది. వావ్ ఈ వాచ్ ఎవరికి నాకేనా అని నర్మద చేతిలో ఉన్న వాచ్ ని చూసి సాగర్ అడుగుతాడు. రేపు మా నాన్న 50వ బర్త్ డే.. తన ప్రతి పుట్టినరోజు ని నేను దగ్గరుండి చేసేదాన్ని.. 50వ పుట్టినరోజు కూడా నేనే చేయాలని మా నాన్న కోరిక. ఇప్పుడు నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నానని మా నాన్న పీకల్లోతూ కోపంగా ఉన్నాడు. ఈ గిఫ్ట్ మా నాన్నకి ఇవ్వాలని ఎప్పుడో తీసుకున్నాను. నామీద మా నాన్నకు ఉన్న కోపము నన్ను మా నాన్నకు దగ్గర చేయదేమో అని నర్మదా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక సాగర్ నువ్వు ఏం బాధపడకు మీ నాన్న దగ్గరికి రేపు వెళ్దాం. నీ చేతుల మీద గాని బర్తడే చేద్దాం. గిఫ్ట్ కూడా నువ్వు మీ నాన్నకి ఇచ్చేయి అనేసి ధైర్యం చెప్తాడు.
Also Read : అవనిపై అక్షయ్ సీరియస్.. పల్లవి చెంప పగలగొట్టిన అవని.. కోడలి కోసం కొట్లాట..
నువ్విలా ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని సాగర్ అంటాడు. ఇక ప్రేమ చదువుకుంటూ ఉంటుంది. ధీరజ్ మాత్రం పడుకోడానికి పడుకుంటాడు. రేపు ఎగ్జామ్ ఉందన్న సంగతి నీకు తెలుసా అని ధీరజ్ పై సీరియస్ అవుతుంది ప్రేమ. రేపు ఎగ్జామ్ ఉందన్న సంగతి నాకు తెలుసు ఏదో ఒకటి రాసుకోవచ్చు లేవే నన్ను పడుకో నువ్వు డెలివరీలు చేసి చేసి అలసిపోయానని అంటాడు. ముందు బుక్ పట్టుకొని చదువుకో అని ఆర్డర్ వేస్తుంది. ఇక ధీరజ్ చేసేదేమి లేక చదువుకుంటాడు. మధ్యలో నిద్ర పోవడంతో ప్రేమ మీద పడుకుంటాడు. ప్రేమ మనసులో ధీరజ్ పై ప్రేమ పుడుతుంది. ఈ దూరం కాస్త పోయి దగ్గర అవుతారేమో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఎగ్జామ్ హాల్లో ప్రేమ ధీరజ్ కి చూపిస్తూ దొరికిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..