Telekinesis: ప్రాణం ఉన్న వస్తువులు కదలడం సర్వసాధారణం. కానీ, వస్తువులు కూడా వాటంతట అవే కదిలితే..? మనిషి కదలకుండా ఉన్నా వస్తువులు చేతిలోకి వచ్చేస్తే..? ఇదంతా చూస్తే ఏదో సూపర్ పవర్ లాగా అనిపించొచ్చు. మరికొందరు ఏదో మ్యాజికల్ ట్రిక్ అనుకుంటారు. మ్యాజిక్ కాదు. సూపర్ పవర్ అంతకంటే కాదు. అయినా సరే ఒకరకమైన శక్తిని ఉపయోగించి వస్తువులను కదిలిలేలా చేయడం సాధ్యమే. దీన్నే ‘టెలీకైనెసిస్’ అని పిలుస్తారు. మనస్సు శక్తిని మాత్రమే ఉపయోగించి వస్తువులను కంట్రోల్ చేయడం అని దీని అర్థం.
టెలికినిసిస్‌ని సైకోకినిసిస్ అని కూడా పిలుస్తారు. కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ సినిమాలలో ఇది సాధ్యమే. కానీ, నిజమైన టెలికినిసిస్ అంటే ఏంటి? ఇది కేవలం ఫిక్షన్స్ నుండి వచ్చిన సూపర్ పవర్ మాత్రమే లేదా ఇంకేదైనా ఉందా? అనేది తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది.
బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) టెక్నిక్‌తో ఇటీవల టెలీకైనెసిస్ గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. కొన్ని రకాల రోబోటిక్ వెపన్స్‌ని కంట్రోల్ చేయడానికి కూడా BCI టెక్నిక్ పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది నిజమైన టెలికినిసిస్ కానప్పటికీ దీన్ని కూడా ఒకరకమైన టెలీకైనెసిస్ అనే పిలుస్తారట.
టెలీకైనెసిస్ ఎలా పని చేస్తుంది?
టెలీకైనెసిస్ పారాసైకాలజీలో అందరికీ కాస్త ఎక్కువే ఆసక్తి ఉన్న విషయం. విశ్వంలో ఉన్న అనేక అంశాల లాగానే టెలీకైనెసిస్ అనేది కూడా సైన్స్‌కి అంతుచిక్కని విషయమనే చెప్పాలి. టెలికినిసిస్ వాస్తవమైతే, దూరంలో ఉన్న పదార్థంతో సంకర్షణ చెందే తెలియని శక్తి వల్ల వస్తువులు కదిలే అవకాశం ఉందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు.టెలీకైనెసిస్‌కు అసలైన కారణం ఏంటనే విషయంపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతునే ఉన్నాయి. అయినప్పటికీ సరైన రుజువులు లేకపోవడం వల్ల ఆ అంశం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
1970లో సోవియట్‌కు చెందిన నినా కులగినా అనే మానసిక వైద్యురాలు వస్తువులను తాకకుండా కదిలించినప్పుడు టెలికినిసిస్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు బ్లాక్-అండ్-వైట్ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. అయితే, కనిపించని దారాలు వాడి లేదా ఇతర్ ట్రిక్స్ వల్ల ఆమె వస్తువులను కదిలించి ఉంటుందని చాలా మంది వాదించారు.
ALSO READ: చితి నుంచి లేచొచ్చిన పెద్దాయన..!
ఇక 2024లో ఓ వ్యక్తి తాకకుండానే చెంచాలను కదిలించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కానీ, ఇది కూడా ఒక ట్రిక్ కావచ్చని నిపుణులు భావించారు. దీని వెనక సైన్స్ ఉందని కొందరు నమ్మితే ఫిక్షన్ అని మరికొందరు అనుకుంటారు. మరికొందరేమో ఏదో సూపర్‌నెచురల్ పవర్ వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. ఇప్పటికీ, టెలికైనెసిస్ అనేది ఒక వీడని మిస్టరీ లాగానే మిగిలిపోయింది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.