Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే చెంప దెబ్బ కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ ఘటనతో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ కొద్దిసేపు అలా చూస్తూ ఆగిపోయారు. ఆ తర్వాత విమానం తలుపులు తెరుచుకున్నట్టు గమనించి వెంటనే నవ్వుతూ బయటకు వచ్చారు. ఆయన వెనుక తన భార్య బ్రిగెట్టే కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో వీళ్ళ ఇద్దరి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది. మాక్రన్ 15 ఏళ్లు ఉన్నప్పుడే 39 ఏళ్లు ఉన్న డ్యాన్స్ టీచర్‌లో లవ్ లో పడ్డాడంట.
ఇమ్మాన్యుయేల్ మాక్రన్ 15 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తన కంటే 24 ఏళ్ల పెద్దదైన డ్యాన్స్ టీచర్‌తో లవ్‌లో పడ్డాడు. అప్పటికే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పైగా ఆ ముగ్గురిట్లో ఒకరు మాక్రన్ కు క్లాస్ మేట్ కూడా. అయినప్పటికీ ఆయన బ్రిగెట్టీని ప్రేమించారు. ఆమె కూడా అతని ప్రేమను తేలికగా తీసుకుంది. టీచర్ ను స్టూడెంట్ లవ్ చేయడం చాలా కామన్ గా తీసుకుంది. కానీ ఆ తర్వాత మాక్రన్ చాలా సీరియస్ గా లవ్ చేయడం ప్రారంభించారు. ఓ రోజు తన మనస్సులో ఉన్న మాట చెప్పేశారు.
WATCH – pic.twitter.com/3v2i3o92gd
— Times Algebra (@TimesAlgebraIND) May 26, 2025
ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన లవ్ ప్రపోజల్ కు బ్రిగెట్టీ పడిపోయింది. ఆ విషయం మాక్రన్ పేరెంట్స్ కు కూడా తెలిసిపోయింది. అందరి పేరెంట్స్ లాగానే ఫస్ట్ వారు కొడుకుని మందలించారు. బ్రిగెట్టికి దూరంగా పంపి చదివించారు. అయినా మాక్రన్ మాత్రం మారలేదు. తన లవ్ ను దూరం చేసుకోలేకపోయారు. తన మనస్సులో ప్రేమ చంపుకోలేకపోయారు.
ALSO READ: Fake Gold: మార్కెట్లోకి ఫేక్ బంగారం.. గుర్తించకపోతే బుక్కైపోతారు
బ్రిగెట్టి కూడా తనను అంతగా లవ్ చేస్తున్న మాక్రన్ ను చూసి ప్రేమించడం స్టార్ట్ చేసింది. ఆతన్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. బ్రిగెట్టి తన ముగ్గురు పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చింది. మొత్తానికి 2007లో మాక్రాన్ 29 ఏళ్ల వయస్సులో ఆమెను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతానికి వీళ్ల పెళ్లి జరిగి 18 ఏళ్లు అవుతుంది. మాక్రన్ కు ఇప్పుడు 47 ఏళ్లు. బ్రిగెట్టికి 72 ఏళ్లు. అయితే ఈ రోజు మాక్రన్‌ను అతడి భార్య బ్రిగిట్టే చెంప దెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో.. వీరి లవ్ స్టోరీ బయటపడింది.