BigTV English
Advertisement

Viral Video: నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. ఆ తర్వాత పిచ్చి గంతలు..

Viral Video: నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. ఆ తర్వాత పిచ్చి గంతలు..

Viral Video: సోషల్‌ మీడియాలో షాకింగ్ వీడియోలు, భయానక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వికృత చేష్టలు, మనుషులను భయాలకు గురిచేస్తూ కొంత మంది ప్రవర్తిస్తుంటారు. అయితే ఇలాంటివి కొన్ని చాటుగా జరిగితే మరికొన్ని మాత్రం ఏకంగా జనారణ్యంలోనే వెలుగుచూస్తుంటాయి. అయితే తాజాగా ఇలాంటి రకమైన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ నడిరోడ్డుపై భయానకంగా ప్రవర్తించింది. రోడ్డుపై మధ్యలో కూర్చుని వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. వింతగా ప్రవర్తిస్తూ, వింత చేష్టలు చేస్తూ గెంతులు వేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.


వీడియోలో కనిపించిన దృశ్యాల్లో ఓ మహిళ క్షుద్రపూజలు చేస్తూ కనిపించింది. నడిరోడ్డుపై కూర్చుని విచిత్రంగా ప్రవర్తించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. జబల్ పూర్ లోని నడి రోడ్డుపై ట్రాఫిక్లో ఓ మహిళ క్షుద్రపూజలు చేస్తూ దర్శనమిచ్చింది. తనతో పాటు పూజకు సంబంధించిన సామాగ్రిని కూడా వెంట పెట్టుకుని ఉంది. బ్యాగులో వాటల్ బాటిల్, ఇంకా చాలా రకాల వస్తువులు కూడా ఉన్నాయి. రోడ్డుపై మంట పెట్టి దానిపై ఏదో చల్లుతూ నిలబడి వింత చేష్టలు చేసింది.

అనంతరం ఆ మంట చుట్టూ గెంతుతూ విచిత్రంగా ప్రవర్తించింది. ఒక్కసారిగా ఈ వింత చేష్టలు చూసిన వాహనదారులు కొంత మంది భయంతో పారిపోతే, మరికొంత మంది మాత్రం అక్కడే ఆగిపోయి చూశారు. అయితే ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగా లేక ఇలా ప్రవర్తించిందని సమాచారం. మంత్రాలు చదువుతూ, మంటలతో చెలగాటం ఆడిన మహిళ తీరును అక్కడి స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను తీసి అక్కడి వారు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.


Related News

Viral Video: బ్యాండ్ మేళాతో పిల్లల్ని నిద్రలేపిన తల్లి.. బద్దకానికి భలే ట్రీట్మెంట్!

Costliest Pani Puri: వోడ్కాతో పానీపూరీ, ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Duvvada Srinivas: వాళ్ల వల్లే మాకు అంత క్రేజ్.. దువ్వాడ షాకింగ్ కామెంట్స్!

Viral Video: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?

Fact Check: సౌదీలో అట్టహాసంగా దీపావళి వేడుకలు, అసలు విషయం ఏంటంటే?

Viral Video: రన్నింగ్ కారులో నుంచి మూత్రం పోసిన యువకుడు, నెట్టింట వీడియో వైరల్!

Sadar Festival: సదర్ దున్నపోతుకు కాస్ట్లీ మద్యం.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Big Stories

×