BigTV English

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో సూరజ్‌ రేవణ్ణకు బెయిల్‌ !

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో సూరజ్‌ రేవణ్ణకు బెయిల్‌ !

Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజల్ రేవణ్ణ సోదరుడు, జనతాధళ్ సెక్యులర్ నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్ కార్యకర్తపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక వేధింపులు పాల్పడుతున్నట్లు ఆరోపనలు ఉన్నాయి. సూరజ్ రేవణ్ణపై 27 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 16న గన్నికాడలోని తన ఫామ్ హౌస్‌లో సూరజ్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని సదురు వ్యక్తి ఫిర్యాదులో ఆరోపించారు.


ఫిర్యాదు ఆధారంగా హోలెనరసిపుర పోలీసులు సూరజ్ రేవణ్ణ సెక్షన్ 377, 342 క్రింద కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనమడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సూరజ్ రేవణ్ణ ఖండించారు. ఇదిలా ఉంటే సూరజ్ రేవణ్ణపై పార్టీ కార్యకర్తలే లైంగిక వేధింపుల తప్పుడు కేసు పెట్టారని సూరజ్ రేవణ్ణ సన్నిహితుడు శివ కుమార్ ఆరోపించారు.

సూరజ్‌ను కొల్లంగి గ్రామంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సందర్భంగా తాను కలిసానని ఫిర్యాదు చేసిన వ్యక్తి కంప్లయింట్ లో పేర్కొన్నాడు, ఇద్దరం ఒకరి నంబర్లు ఒకరం తీసుకున్నానని తెలిపాడు. జూన్ 16 న గన్నికడలోని ఫామ్ హౌస్ కు తనను పిలిపించి, డోర్ లాక్ చేసి వద్దన్నా బలవంతంగా తన డ్రెస్ తొలగించి లైంగిక చర్యకు పాల్పడ్డాడని సూరజ్ రేవణ్ణపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని.. తనతో కలసి ఉంటే రాజకీయంగా ఎదిగేందుకు సహకరిస్తానని సూరజ్ చెప్పినట్టు సదరు యువకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


సూరజ్ రేవణ్ణ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ ప్రధాని దేవగౌడ మనవల్లలో ఒకడు ఈ సూరజ్ రేవణ్ణ. జీడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ కొడుకు కూడా. హాసన్ జిల్లా నుంచి సూరజ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేవెగౌడ కుటుంబంలో రాజకీయాల్లోకి వచ్చిన ఎనిమిదవ వ్యక్తి సూరజ్. దేవెగౌడ కుటుంబం రాజకీయంగా ఎంత ఎదిగిందో మన వల్లపై లైంగిక ఆరోపణలతో అంతా అభాసుపాలైంది.

Also Read: యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో షాక్ !

సూరజ్ రేవణ్ణ అన్న ప్రజ్వల్ రేవణ్ణ కొందరు అమ్మాయిలు లైంగికంగా వేధించి వారి అనుమతి లేకుండా వీడియోలు తీసినట్టు ఆరోపణలు చేశారు. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. 2024 మే 31 న పోలీసులు రేవణ్ణను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తల్లిదండ్రులు కూడా అరెస్టయ్యారు. రేవణ్ణ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×