BigTV English

Hyperdontia: ఈ అమ్మాయి నోటిలో 81 దంతాలు, ఆ చిన్ని నోటిలో అన్ని ఎలా పట్టాయో?

Hyperdontia: ఈ అమ్మాయి నోటిలో 81 దంతాలు, ఆ చిన్ని నోటిలో అన్ని ఎలా పట్టాయో?

ఒకరి నోటిలో ఎన్ని దంతాలు ఉంటాయో అందరికి తెలిసిందే. 32 దంతాలు పూర్తిగా రావాలనుకుంటే పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదగాలి. కానీ 11 ఏళ్ళ చిన్నారి నోటిలో ఏకంగా 81 దంతాలు ఉన్నట్టు గుర్తించారు. ఇది వైద్య చరిత్రలో ఒక వింత అనే చెప్పాలి. ఇలా నోటిలో అధిక దంతాలు ఉండే పరిస్థితిని హైపర్ డోంటియా అని పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన కేసుగానే చెప్పాలి. వైద్యులు ఆమెకు 81 దంతాలను ఎలా తగ్గించారో తెలుసుకోండి.


హైపర్ డోంటియా అంటే ఏమిటి?
హైపర్ డోంటియా అంటే ఒక వ్యక్తికి సాధారణంగా ఉండవలసిన దంతాల కన్నా ఎక్కువ దంతాలు ఉంటే ఆ వైద్య పరిస్థితిని హైపర్ డోంటియా అంటారు. సాధారణంగా ఒక మనిషికి 20 పాల దంతాలు ఉంటాయి. ఆ తర్వాత 32 శాశ్వతమైన దంతాలు ఉంటాయి. పాల దంతాలను ఆకురాల్చే దంతాలు అని కూడా అంటారు. పాల దంతాలు రాలిపోయాక శాశ్వతమైన దంతాలు వస్తాయి. అయితే ఈ దంతాలతో పాటు సూపర్ న్యుమరరీ దంతాలు అని పిలిచే అదనపు దంతాలు కూడా నోటిలోని అసాధారణ ప్రదేశాలలో పెరుగుతాయి. అంటే సాధారణ దంతాల వెనుకా లేదా చిగుళ్ళు లోపల కూడా ఇవి పుట్టుకొస్తాయి. ప్రపంచంలో ఒకటి నుంచి నాలుగు శాతం మందిలో మాత్రమే ఇలా జరుగుతుంది.

బ్రెజిల్ కు చెందిన 11 ఏళ్ల చిన్నారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమెకు 18 పాల దంతాలతో పాటు 32 శాశ్వత దంతాలు, 31 అదనపు దంతాలు ఉన్నాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత తీవ్రమైన హైపర్ డోంటియా కేసులలో ఒకటిగా చెబుతున్నారు వైద్యులు.


దంత వైద్యుడు ఆమెకు చేసిన ఎక్సరేలో ఈ అదనపు దంతాలన్నీ బయటపడ్డాయి. కొన్ని దంతాలు ఆమె చిగుళ్లలో కూడా ఉన్నాయి. మరికొన్ని అదనపు దంతాలు సాధారణ దంతాల కంటే చిన్నవిగా, భిన్నంగా, వింత ఆకారాల్లో ఏర్పడ్డాయి. వైద్యులు ఆమె మొత్తం ఆరోగ్యాన్ని చెక్ చేశారు. ఇతర ఏ సిండ్రోమ్‌లు ఆమెకు లేవు. కేవలం అదనపు దంతాల సమస్య మాత్రమే ఉంది. అలాగే ఆమెకు జన్యు పరీక్షలు కూడా నిర్వహించారు. క్రోమోజోమ్ 9 లోని ఒక భాగంలో లోపం వల్ల ఆమెకు ఇలా హైపర్ డోంటియా సమస్య వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె కుటుంబంలో ఎవరికీ కూడా ఈ సమస్య లేదు.

ఆ దంతాలను ఏం చేశారు?
హైపర్ డోంటియా ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ పూర్తిగా చెప్పలేకపోతున్నారు. దానికి జన్యుపరమైన కారణాలు ఉండి ఉండచ్చని భావిస్తున్నారు. 81 దంతాలు నోటిలో ఉండడం వల్ల ఆమెకు చాలా సమస్యగా మారిపోయింది. ఆ అదనపు దంతాలు ఆమె దవడలను బిగుసుకు పోయేలా చేస్తున్నాయి. సాధారణ దంతాలను వాటి స్థానంలో కాకుండా పక్కకు జరిగిపోయేలా చేశాయి. అలాగే అవి విపరీతంగా నొప్పి పెట్టడం, చిగుళ్లలో తిత్తులు ఏర్పడడం వంటి వాటికి కారణమయ్యాయి. దీంతో వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆమె దవడ దెబ్బ తినకుండా ఉండడానికి వారు దశలవారీగా అదనపు దంతాలను జాగ్రత్తగా తొలగించుకుంటూ వచ్చారు. అలాగే ఆమె అసలైన దంతాలను సరైన స్థానంలో ఉంచేలా చేయడానికి బ్రేస్ లను ఉపయోగించారు. ఆమెకు చికిత్సలవారీగా చేసుకుంటూ వచ్చారు.

హైపర్ డోంటియా సమస్యకు చికిత్స చేయడం అంత సులభం కాలేదు. అదనపు దంతాలు ఆమె నోట్లోని వివిధ భాగాల్లో ఉన్నాయి. చిగుళ్లలో కూడా ఇరుక్కుపోయాయి. వాటిని తొలగించడం ఎంతో కష్టంతో కూడుకున్న పనిగా మారింది. దవడలు దెబ్బ తినకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి వైద్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. చికిత్స తర్వాత ఆమె ముఖం అందంగా కనిపించేలా సహజంగా ఉండేలా పరువు జాగ్రత్త పడాల్సి వచ్చింది.

హైపర్ డోంటియా సమస్య చాలా మందికి ఉంటుంది. అయితే సాధారణంగా ఒకటి లేదా రెండు అదనపు దంతాలు మాత్రమే ఉంటాయి. ఏకంగా 31 అదనపు దంతాలు ఉండడం ఇదే మొదటిసారి అని వైద్యులు చెబుతున్నారు.

Related News

Viral video: రోడ్డుపై నడుచుకుంటూ ఒక్కసారిగా.. స్లాబ్ విరిగిపోయి డ్రైనేజీలో పడిపోయిన యువకుడు, వీడియో వైరల్

Viral video: భూమ్మీద నీకింకా నూకలున్నయ్ బ్రో.. అందుకే రెప్పపాటు సమయంలో చచ్చిబతికావ్

Viral Couple: ట్రక్‌లోనే ఇల్లు, జీవితం.. ఇలా ఉంటున్నారు ఈ దంపతులు.. సూపర్ కదా!

UP Man Arrested: నోరా ఫతేహిలా కనిపించాలంటూ భార్యను అలా చేసిన భర్త.. సీన్ కట్ చేస్తే..

Viral Video: 28వ అంతస్తులో ఆవు దూడ.. భలే పెంచుతున్నారే!

Viral Video: పోలీస్ స్టేషన్‌లో మహిళ అల్లరి, దాడి.. వీడియో చూసి పోలీసులు షాక్!

Big Stories

×