BigTV English

WhatsApp Scam: ఈ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేశారో.. బతుకు బస్టాండే!

WhatsApp Scam: ఈ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేశారో.. బతుకు బస్టాండే!

WhatsApp Scam: ఈ మధ్యకాలంలో నెట్టింట్లో బూచోళ్లు ఎక్కువైపోయారు. అడ్డమైన లింకులు పెట్టి అడ్డంగా దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న ఘటనలు మనం తరుచూ వింటూనే ఉన్నాము. ఇలాంటి వాటిపై పోలీసులు ఎంత ఫోకస్ పెట్టినా.. అనేక ఫిర్యాదులు పోలీస్టేషన్‌లో నమోదు అవుతూనే ఉన్నాయి. పలు రకాల మోసాలతో అమాయుకులను వలలో వేసుకుని.. కొన్ని కోట్లు కొల్లగొడునతున్నారు సైబర్ నేరగాళ్లు.


ఇన్‌స్టా, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ వంటి.. పలురకాల సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి.. సైబర్ నేరగాళ్లు నిలువునా ముంచెత్తున్నారు. రోజుకు కొన్ని వేల మంది అమాయికులు సైబర్స్ చీటర్స్ చేతిలో మోసపోయి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు.

ముఖ్యంగా ఏపీకే (APK) ఫైల్స్ రూపంలో సైబర్ నేరగాళ్లు.. సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వందలాది మంది తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు మాయమైనట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కారణం వారు డౌన్‌లోడ్ చేసిన నకిలీ అప్లికేషన్‌లు.


APK ఫైల్ అంటే ఏమిటి?
ఏపీకే అనేది “Android Package Kit”. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యం కాని యాప్స్‌ను.. మనం ఇతర వెబ్‌సైట్ల నుండి డౌన్‌లోడ్ చేసేటప్పుడు.. APK ఫైల్స్ రూపంలో వస్తాయి. వీటిని మాన్యువల్‌గా మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తాం. కానీ ఇదే పద్ధతిని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

సైబర్ మోసాల కొత్త రూపం: APK ఫైల్ ట్రాప్
సైబర్ నేరగాళ్లు క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏపీకే ఫైల్ రూపంలో వాళ్లు నకిలీ UPI యాప్స్, బ్యాంకింగ్ యాప్స్, ఫైన్నాన్స్ యాప్స్, గేమింగ్ యాప్స్‌ను డిజైన్ చేసి, వాటిని సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి రూ.500 క్యాష్ బ్యాక్ వస్తుంది అని.. మరొకటి కొత్త BHIM యాప్ – డైరెక్ట్ ట్రాన్స్‌ఫర్ వేగంగా అవుతుంది అంటూ ఆకర్షణీయమైన మాటలతో ప్రజలను మాయ చేస్తున్నారు.

ఎలా డబ్బు దోచుకుంటారు?
వారు పంపే APK ఫైల్‌లో మాల్వేర్ ఉంటుంది. మీరు ఆ యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేస్తే, అది మీ మొబైల్‌కి యాక్సెస్ తీసుకుంటుంది.

ఉదాహరణకు:

SMS Permission: OTPలు చదివేయటానికి

Accessibility Permission: మొబైల్‌ను పూర్తిగా నియంత్రించేందుకు

Screen Recording/Keylogging: మీరు టైప్ చేసే బ్యాంక్ పాస్వర్డ్, UPI PIN, కార్డు వివరాలు రికార్డ్ చేయడానికి

ఇలా అన్ని సమాచారాన్ని నేరుగా హ్యాకర్‌కు పంపించి, వారు UPI యాప్‌ల ద్వారా మిమ్మల్ని మోసం చేసి, డబ్బును ఖాతా నుండి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఒకసారి డబ్బు వెళ్లాక, తిరిగి పొందడం చాలా కష్టం.

ఓ సెకనులో తీసుకున్న నష్టం – ఊహించలేనిది
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇదే ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని కేసుల్లో ఫోన్‌లో ఉన్న Google Pay, PhonePe యాప్‌ను క్లోన్ చేసి ఫేక్ యాప్‌ను పంపించి, యూజర్‌ల నుంచి డబ్బు దోచుకున్న ఘటనలు నమోదయ్యాయి.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు
– బెంగళూరులో ఒక వ్యక్తి ట్రాఫిక్ చలాన్ లాగా వాట్సాప్ ద్వారా పంపిన APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ₹70,000 పోగొట్టుకున్నాడు.
(https://www.hindustantimes.com/cities/bengaluru-news/bengaluru-man-loses-rs-70-000-to-fake-traffic-challan-scam-fraudsters-exploit-through-whatsapp-apk-file-report-101738476339013.html)

– స్కామర్లు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీస్ లోగోను ఉపయోగించి “ట్రాఫిక్ జరిమానాలు” కోసం నకిలీ APK ఫైల్‌లను పంపారు.
(https://www.dtnext.in/news/tamilnadu/now-scammers-send-apk-files-on-whatsapp-with-gctp-logo-835977)

ఢిల్లీలోని ఒక లైబ్రేరియన్ ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ₹70,000 పోగొట్టుకున్నాడు.. నకిలీ ట్రాఫిక్ ఉల్లంఘన APK, దీని వలన స్కామర్లు వాళ్ల బ్యాంక్ ఖాతానుంచి యాక్సెస్ పొందారు.(https://www.hindustantimes.com/cities/others/a-message-a-link-an-apk-file-spell-ruin-101746757834977.html)

ప్రజల కోసం హెచ్చరికలు

  • ఎప్పుడూ ప్లే స్టోర్ నుండే యాప్స్ డౌన్‌లోడ్ చేయాలి.
  • మూడవ పార్టీ వెబ్‌సైట్ల నుంచి APK ఫైల్ డౌన్‌లోడ్ చేయ్యకూడదు
  • ఎవరో పంపిన లింక్‌తో ఏ యాప్‌ అయినా డౌన్‌లోడ్ చేయకండి.
  • మొబైల్‌లో అనవసరమైన permissions ఇవ్వకండి.
  • ఫోన్‌లోకి వచ్చిన అనుమానాస్పద SMSలు, కాల్స్‌ను వెంటనే రిపోర్ట్ చేయండి.
  • ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత అనుమానంలో సైబర్ క్రైమ్ నంబర్ 1930కు కాల్ చేయండి.

సాంకేతికతను మన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి.. కానీ అప్రమత్తంగా ఉండకపోతే అది ప్రమాదాలకు దారితీస్తుంది. ఓ చిన్న APK ఫైల్.. ఓ పెద్ద నష్టం అనే మాట నిజమే కావచ్చు. కనుక, మొబైల్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

 

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×