Aditya 369 :1895లో హెచ్ జి వెల్స్ రూపొందించిన ‘ది టైం మెషిన్’ నుండి స్ఫూర్తి పొంది, 1991లో ప్రముఖ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivas Rao) ‘ఆదిత్య 369’ అనే సినిమాను తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్ జోడించి చాలా అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కీలకపాత్ర పోషించారు. ఇక ఇందులో మోహిని (Mohini)హీరోయిన్గా నటించగా.. అంబరీష్ పూరి కూడా కీలక పాత్ర పోషించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై అనిత కృష్ణ ఎస్పీ నిర్మించగా ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం సమర్పించారు. 1991 జులై 18న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇలాంటి టైం మిషన్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని ఈ తరం అభిమానులకి కూడా చూపించాలనే నేపథ్యంలో నిన్న ఆదిత్య 369 మూవీని రీ రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ టైం మిషన్ ను ప్రసాద్ ఐమాక్స్ లో ఏర్పాటు చేయడంతో అక్కడ థియేటర్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇకపోతే సినిమా రీ రిలీజ్ అయితే చేశారు కానీ అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు.
Sree Leela: ప్రేమ… ఊపిరి కూడా ఆడనంత కావాలి… లవర్‌పై శ్రీలీల ఓపెన్ స్టేట్మెంట్..!
చిరంజీవి వల్లే బాలకృష్ణ ఆదిత్య 369 మూవీ హిట్ కొట్టిందా..?
దీనికి తోడు సినిమా 1991లో విడుదల చేసినప్పుడు కూడా పెద్దగా ఓపెనింగ్ రాలేదని కానీ చిరంజీవి (Chiranjeevi) వల్లే సినిమా హిట్ అయిందని సమాచారం.మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా నిర్మాత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “టైం మెషిన్ గురించి చాలామందికి తెలియదు. 1991లోనే టైం మిషన్ అంటే ఎవరికి అర్థం అయ్యేది కాదు.. దాంతో ఈ సినిమా విడుదల అయినప్పుడు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ఇక ఆ సమయంలో ప్రమోషన్స్ లాంటివి చేయడానికి ప్రైవేట్ చానల్స్ ఏవి ఉండేవి కాదు కదా.. ఇక తద్వారా ప్రజలకు కూడా ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు. అప్పట్లో దూరదర్శన్ మాత్రమే ఉండేది. ఇక ఈ సినిమా ప్రజలలోకి వెళ్ళాలి అంటే చిరంజీవిని రంగంలోకి దింపాలి అనుకున్నాము. అందుకే చిరంజీవి దగ్గరకు వెళ్లి మా సినిమాకి ప్రచారం చేసి పెట్టండి అని అడిగాము.ఇక అప్పట్లో దూరదర్శన్లో 10- 20 సెకండ్ల యాడ్ ఇచ్చేవాళ్ళు. అలా చిరంజీవితో ఈ టైం మిషన్ గురించి దూరదర్శన్ లో ప్రమోషన్ చేయిం చాము. ఆయన వల్లే సినిమా అందరికీ తెలిసి సినిమా మంచి విజయం అందుకుంది. ఇక నాడు చిరంజీవి ప్రమోషన్ చేయకపోయి ఉండి ఉంటే ఈ సినిమా విజయం అయ్యేది కాదు” అంటూ తెలిపారు. ఇక ఇప్పుడు ఈ విషయాలు విని అప్పట్లో బాలయ్య చేసిందేమీ లేదా.. చిరంజీవి వల్లే ఆదిత్య 369 హిట్ అయ్యిందా? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ కెరియర్..
ఇకపోతే బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా నలుగురు కూడా ఒకే తరానికి చెందిన వారే. కానీ ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నా.. చిరంజీవి మాత్రం మెగాస్టార్ అనే బిరుదును దక్కించుకున్నారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటే బాలకృష్ణ మాత్రం వరుస బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకుంటూ బిజీగా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా టైం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. ఎవరి అదృష్టం వాళ్ళది అని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.