OTT Movie : 19 ఏళ్ల యూన్-యంగ్ అనే అమ్మాయి, తన చెవిటి తల్లి కోరిక మేరకు సివిల్ సర్వెంట్ కావాలనే కలలు కంటుంది. కానీ ఒక భయంకరమైన రాత్రి, ఆమె జీవితం తలకిందులు అవుతుంది. ఒక దారుణమైన ఘటనలో, ఆమె పై ఒక హంతకురాలిగా ముద్రపడుతుంది. ఆమె ఇప్పుడు కేవలం ఖైదీగా ఉంటోంది. జైలు గోడలలో ఆమెకు సెల్‌మేట్స్‌తో ఊహించని బంధం ఏర్పడుతుంది. కానీ ఆమె గతం ఆమెను వెంబడిస్తుంది. ఇంతకీ ఆమె జైలుకు ఎందుకు వెళ్ళింది ? ఆ రోజు రాత్రి ఏం జరిగింది ? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 2022 లో దక్షిణ కొరియాలో జరుగుతుంది. యూన్-యంగ్ (హాంగ్ యే-జీ) అనే 19 ఏళ్ల హైస్కూల్ అమ్మాయి, తన చెవిటి తల్లి క్యుంగ్-సూక్ (కిమ్ జీ-యంగ్)తో కలిసి జీవిస్తుంది. ఆమె సివిల్ సర్వెంట్ కావాలనే కలతో, ఒక కెఫేలో పార్ట్-టైమ్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ ఉంటుంది. మరో వైపు తల్లి ఆరోగ్యం కూడా చూసుకుంటుంది. ఆమె తండ్రి మరణం తర్వాత, యూన్-యంగ్ కుటుంబ బాధ్యతలను తీసుకుంటుంది. ఒక రోజు రాత్రి యూన్-యంగ్ పై ఒక వ్యక్తి అఘాయిత్యం చేస్తాడు. ఆమె తల్లిని కూడా బెదిరించే క్రమంలో యూన్-యంగ్ ఆవేశంలో అతన్ని చంపేస్తుంది. ఈ సంఘటన ఆమెను ఒక బాధితురాలి నుండి హంతకురాలిగా మారుస్తుంది. ఆమెకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. జైలులో ఆమె పేరు ఇప్పుడు 2037′ గా మారిపోతుంది.
ఆ తరువాత యూన్-యంగ్ జైలులో ఒక షాకింగ్ వాస్తవాన్ని తెలుసుకుంటుంది. ఆ మృగం చేసిన పనికి ఆమె గర్భవతి అవుతుంది. ఈ వార్త ఆమెను నిరాశలోకి నెట్టివేస్తుంది. దీని వల్ల ఆమె తన తల్లిని కలవడం కూడా మానేస్తుంది. ఒంటరిగా బాధపడుతూ తన గతాన్ని, భవిష్యత్తును ఎదుర్కోలేకపోతుంది. ఈ సమయంలో సెల్ లో ఉండే ఇతర ఖైదీలు ఆమెకు ధైర్యాన్ని ఇస్తారు. యూన్-యంగ్ గర్భం కథలో ఒక కీలకమైన అంశంగా మారుతుంది. ఆమె తన బిడ్డ కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. చివరికి యూన్-యంగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆమె జైలు నుంచి బయటికి వస్తుందా ? తాను నిర్ధోషి అని అందరికీ తెలుస్తుందా ? అనే విషయాలను ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : 1500 కిలోల గోల్డ్ స్మగ్లింగ్… జీ5 లో దుమ్మురేపుతున్న బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా
ఈ కొరియన్ మూవీ పేరు ‘2037’. 2022 లో వచ్చిన ఈ సినిమాకి మో హాంగ్-జెన్ దర్శకత్వం వహించారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.6/10 రేటింగ్ ఉంది. ఇందులో హాంగ్ యే-జీ (యూన్-యంగ్), కిమ్ జీ-యంగ్ (క్యుంగ్-సూక్), జున్ సో-మిన్ (జంగ్-మీ) వంటి నటులు నటించారు.