UP Man: ప్రేమ గుడ్డిదంటారు పెద్దలు.. అది వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే ఒక చక్కని ఉదాహరణ. తనకంటే 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లి అయిన ఓ మహిళ ప్రేమ కోసం ఓ యువకుడు ఏకంగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవరెక్కి నానా హంగామా చేశాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
ఫోన్ ఎత్తలేదని ముంబై నుండి యూపీకి..
పోలీసుల వివరాల ప్రకారం.. యూపీకి చెందిన చందన్ అనే యువకుడు ముంబైలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి 50 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. సదరు మహిళకు అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొద్దిరోజులుగా ఆమె చందన్ ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చందన్.. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలనే ఆరాటంతో ముంబై నుండి నేరుగా ఉత్తరప్రదేశ్ చేరుకున్నాడు.
112 కి ఫోన్ చేసి మరీ టవరెక్కిన ప్రియుడు
అక్కడికి వచ్చినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, చందన్ ఒక ఊహాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఊరి చివర ఉన్న 200 అడుగుల మొబైల్ టవర్ పైకి సరసరకెక్కి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా, తనే స్వయంగా పోలీసుల అత్యవసర నంబర్ ‘112’ కి డయల్ చేసి.. ‘నేను టవరెక్కాను, నా ప్రియురాలిని ఇక్కడికి పిలవండి’ అంటూ సమాచారం ఇచ్చాడు.
Also Read: ఏపీ సంజీవిని ప్రాజెక్ట్.. ఫ్రీ మెడికల్ టెస్ట్‌లు, మందులు ఎలా పొందాలో తెలుసా?
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
విషయం తెలిసిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడికి పరుగులు తీశారు. కిందకు దిగాలంటూ పోలీసులు ఎంత నచ్చజెప్పినా చందన్ వినలేదు. చివరకు ‘నీ ప్రియురాలిని ఇక్కడికి పిలిపించి మాట్లాడిస్తాం, ముందు కిందకు దిగు’ అంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో గంటల హైడ్రామా తర్వాత చందన్ కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ‘ముదురు’ ప్రేమకథ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చాడని భర్తను కిరాతకంగా చంపిన భార్య!
50 ఏళ్ల ప్రియురాలి కోసం టవరెక్కిన ప్రేమికుడు..
తనకంటే 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లి కోసం ఓ యువకుడు ఏకంగా 200 అడుగుల మొబైల్ టవరెక్కి హల్చల్ చేశాడు. ప్రియురాలు ఫోన్ ఎత్తకపోవడంతో ముంబై నుండి యూపీకి వచ్చిన చందన్ అనే యువకుడు.. తానే స్వయంగా 112కు డయల్ చేసి పోలీసులకు సమాచారం… pic.twitter.com/RZbpzCRJgn
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2026