Viral Video: సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్ కోసం చేసే పిచ్చి ప్రయత్నాలు ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే కదులుతున్న రైళ్లలో, రైల్వే ట్రాకుల మీద, లోయ అంచులలో, జలపాతాల చివరలో రీల్స్ చేస్తూ ఎంతో మంది చనిపోయారు. అయినా ప్రజలు మారడం లేదు. తాజాగా ఓ మహిళ నదిలోకి దిగి రీల్స్ చేయాలని భావించింది. కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
రీసెంట్ గా ఉత్తర కాశీలోని మణికర్ణిక ఘాట్ లో ఓ మహిళ తన పిల్లలతో కలిసి స్నానం చేయడానికి వెళ్లింది. అదే సమయంలో నదిలోకి దిగి ఓ రీల్ చేయాలనుకుంది. తన కూతురుకు సెల్ ఫోన్ ఇచ్చి రికార్డు చేయమని చెప్పింది. ఒడ్డు మీద నిలబడి సదరు మహిళ కూతురు వీడియో రికార్డు చేసుంది. ఆమె నదిలోకి దిగడం మొదలు పెట్టింది. నది లోతును సరిగా అంచనా వేయలేకపోయింది. నెమ్మదిగా వెనక్కి వెళ్లింది. కాలు జారి పడిపోయింది. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. వీడియో తీస్తున్న పాప.. ‘ మమ్మీ’ అని అరవడం వినిపించింది. చూస్తుండగానే సదరు మహిళ నీటి ప్రవాహంలో వేగంగా కొట్టుకుపోయింది.
గంగా నదిలో రీల్స్.. కొట్టుకుపోయిన యువతి
తాజాగా ఓ యువతి గంగా నదిలో రీల్ చేసేందుకు యత్నించి ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది.యూపీ ఉత్తరకాశీలో మణికర్ణిక ఘాట్ వద్ద ఈ ఘటన.యువతి నీటి ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో పాటు ఆమెకు ఈత రాకపోవడంతో గంగా నదిలో మునిగి చనిపోయింది. రీల్స్ కంటే ప్రాణాలు… pic.twitter.com/osXRzARA3k
— ChotaNews App (@ChotaNewsApp) April 16, 2025
పోలీసులు ఏం చెప్పారంటే?
గంగా నదిలో నీటి ప్రవాహాన్ని సదరు మహిళ అంచనా వేయలేకపోవడంతో పాటు ఈత రాకపోవడం వల్లే కొట్టుకుపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆమె కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇంతకీ ఆమె బతికి ఉందా? లేదా? అనే విషయాలపై పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. చాలా మంది ఆమె చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో రీల్స్ కోసం ఇలా చేయకూడదని పోలీసుల సూచిస్తున్నారు. ఆమె కూడా రీల్స్ కోసమే నీళ్లలోకి దిగినట్లు సదరు మహిళ కూతురు చెప్పిందన్నారు.
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
అటు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఓవైపు ఆమె మీద జాలి చూపిస్తూనే, మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిల్స్ కంటే ప్రాణాలు ముఖ్యమని గుర్తుంచుకోవాలంటున్నారు. రీల్స్ కోసం వెర్రి వేశాలు వేసే వాళ్లు ఈ వీడియోను చూసి అయినా బుద్ది తెచ్చుకోవాలంటున్నారు. “మహాతల్లి బాగానే నీళ్లలో కొట్టుకు పోయింది. ఆ పాప పరిస్థితి ఏంటో?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఆ పాప కోసమైనా తను క్షేమంగా ప్రాణాలతో బయటపడాలి” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇన్ స్టా గ్రామ్ మదర్స్ ఇలాంటి చావులకు అర్హులే. సోషల్ మీడియా రీల్స్ కోసం భర్తలను పిల్లలను పట్టించుకోవడం మానేశారు. మరికొంత మంది సోషల్ మీడియా ఫ్రెండ్స్ తో యవ్వారాలు నడుపుతూ కట్టుకున్న భర్తలను, పుట్టిన పిల్లలను కడతేర్చుతున్నారు” అంటూ మండిపడుతున్నారు.
Read Also: ప్రపంచంలో పాస్ పోర్ట్ ఉన్న ఏకైక మమ్మీ, 3000 ఏళ్ల రామ్సెస్ 2 గురించి మీకు తెలుసా?