Telangana Weather Updates: హైదరాబాద్‌లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు భగభగమంటున్న ఎండలు.. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో తీవ్రమైన ఎండలతో పాటు.. వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు 18 జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడాతాయని పేర్కొంది.
తీవ్రమైన ఎండల నేపథ్యంలో రేపు, ఎల్లుండి ఉష్టోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరుగుతాయని, అధిక ఎండల కారణంగా వాతావరణంలో తేమ శాతం పెరిగి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. అకాల వర్షాలతో రైతులతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండడంతో ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. వచ్చే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
కాగా హిందూ మహాసముద్రంలో పరిస్థితులు ఆగస్టు వరకు తటస్థంగా ఉండే అవకాశం ఉందని ఆస్ట్రేలియన్ వెదర్ బ్యూరో తాజా బులెటిన్‌లో పేర్కొంది. పసిఫిక్‌తో పాటు, హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు భారత్ రుతుపవనాలలో కీలక పాత్ర పోషిస్తాయి. పసిఫిక్ లో సెప్టెంబర్ వరకు తటస్థ పరిస్థితులు ఉండే అవకాశం 50% కంటే ఎక్కువ ఉందని అమెరికా వాతావరణ అంచనా కేంద్రం అంటోంది. సంవత్సరం చివరి వరకు ఇది కొనసాగే అవకాశం ఉందని, లా నినా లేదా ఎల్ నినో కంటే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుందంటున్నారు నిపుణులు.
Also Read: విద్యార్థులపై విష ప్రయోగానికి కుట్ర.. స్కూల్ వాటర్ ట్యాంక్‌లో..
ఈ అంచనా నిజమైతే, 12 ఏళ్ళలో రుతుపవనాల కాలంలో ఎల్ నినో లేదా లా నినా ఉనికిలో లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. జూన్-సెప్టెంబర్ కాలంలో భారత్ లో ఎంత వర్షపాతం నమోదవుతుందన్నది ఈ రెండు పరిస్థితుల ప్రకారమే అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కండీషన్ డిఫరెంట్ గా ఉంది. విషయం ఏంటంటే రుతుపవనాల అంచనాలను మరింత క్లిష్టం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఏడాది వాతావరణ అంచనాలను సంస్థలు సరిగా వేయడంలో విఫలమవుతున్నాయి. ఈసారి కచ్చితమైన అంచనా మరింత కష్టమే అంటున్నారు.