Indian Railways: రైల్వే ప్రయాణంలో ప్యాసింజర్లు చేసే పొరపాట్లు ఇతర ప్రయాణీకులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రయాణీకుడు చేసిన పనికి కాసేపు, రైల్లో టెన్షన్ వాతావరణ నెలకొన్నది. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో పూణే జిల్లాలోని యెవత్ సమీపంలో కలుతున్న దౌండ్- పూణే షటిల్ రైలులోని కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఓ ప్రయాణీకుడు రైల్లోని రెస్ట్ రూమ్ లో బీడీని వెలిగించి డస్ట్ బిన్ లో పడేశాడు. వెంటనే, డస్ట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బోగీలో పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా ఫైర్ అలారం మోగడంతో అందరూ ఒక్కసారి భయపడ్డారు. డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) కోచ్ లో ఆ సంఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఆ సమయంలో కొద్దిమంది మాత్రమే ప్రయాణీకులు ఉన్నట్లు తెలిపారు. చెత్త కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలిపారు. ఆందోళనకు గురైన ప్రయాణీకులు అలారం మోగించినట్లు వివరించారు.
నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు
రైల్లో బీడీ కాల్చి, ప్రయాణీకులలో భయాందోళనకు కారణమైన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన 55 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు. టాలెట్ నుంచి పొగలు వచ్చిన విషయాన్ని ప్రయాణీకులు వెంటనే, అధికారులకు చెప్పారు. రైల్వే సిబ్బంది వెంటనే మంటలను ఆర్పారు. ఈ ఘటనలు ఎవరికి ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ప్రయాణీకులు భద్రతా చర్యలు పాటించాలన్న అధికారులు
ఈ ఘటనకు సంబంధించి దౌండ్ రైల్వే పోలీస్ స్టేషన్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రయాణీకులు కచ్చితంగా భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు. రైళ్లలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. ప్రయాణీకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మంటలకు కారణం అయ్యే వస్తువులను తీసుకెళ్లకూడదన్నారు. స్వల్ప అగ్ని ప్రమాదం కారణంగా ప్రయాణీకులు భయాందోళనకు గురైన మాట వాస్తవమేనని చెప్పిన అధికారులు, ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
Read Also: గుజరాత్ సీఎం ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేసిన పాకిస్తాన్.. ఇది 1965 ఘటన!
రన్నింగ్ ట్రైన్ లో ఈజీగా మంటలు
ప్రయాణిస్తున్న రైల్లో మంటలు ఈజీగా అంటుకునే అవకాశం ఉదంటున్నారు నిపుణులు. రైలు వేగానికి మంటలు కూడా వేగంగా విస్తరిస్తాయని వెల్లడించారు. అందుకే, ప్రయాణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సిగరెట్లు, బీడీలు వెలిగించకూడదన్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అందుకే, రైలు ప్రయాణం చేసే వాళ్లు కచ్చితంగా ఫైర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు రైల్వే. తాజాగా రైల్లో స్వల్ప ప్రమాదం జరిగడంతో అదుపు చేయగలిగామని, లేదంటే, పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ప్రయాణం చేయాలంటే సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు.
Read Also: అచ్చం ఆ సినిమాలో జరిగినట్లే.. పైలట్ చివరి మెసేజ్ ఇదే!