Viral Video: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో యువత చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి వైరల్ అవ్వడం కోసం.. కొంత మంది యువత వెర్రి చేష్టలతో రీల్స్ చేస్తున్నారు. వారు ఫేమస్ కావాలని నేపథ్యంలో.. వారి ప్రాణాలను పణంగా పెట్టడుతున్నారు. ఇప్పటికే స్టంట్స్ రీల్స్ చేస్తూ.. కొంత మంది యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై ప్రమాదకర సంస్ట్‌కు.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (VC Sajjanar) పోస్ట్ చేశారు. వీడియోలో ఓ యువకుడు రైలు వెళ్తుండగా ట్రాక్ మధ్యలో నిలువుగా పడుకొని, రైలు దగ్గరగా వస్తున్న సమయంలో.. వీడియోను రికార్డ్ చేసాడు. ఇది సోషల్ మీడియా వేదికలపై వైరల్ అయ్యింది.
దీనిపై వీసీ సజ్జనార్ ట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పేమ్ కోసం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. యువత ఇలాంటి ప్రమాదకర పనులు చేస్తున్నారు. రీల్స్ చేసి ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలనే తాపత్రయమే తప్ప.. ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయడం లేదు. ప్రమాదం జరిగితే తల్లితండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే.. సోయి కూడా వీరికి ఉండటం లేదు. సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేకుంటే వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయని.. వీళ్లు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఫేమస్ కోసం పిచ్చి పరాకాష్టకు చేరిందని ఇలాంటి వారిని అరెస్ట్ చేయాలని రైల్వే శాఖ, ఆర్‌పీఎఫ్ సిబ్బందికి ఎక్స్ వేదికగా నెటిజన్లు ట్యాగ్ చేశారు. ఇలాంటి వాళ్లను మీరు తప్పనిసరిగా అరెస్ట్ చేయాలని, లేకపోతే వీడిని చూసి ఇంకో పది మంది ఇలా చేస్తారని పలువురు నెటిజన్‌లు కామెంట్స్ పెట్టారు.
సామాజిక మాధ్యమాల వాడకాన్ని తప్పుపెట్టలేము. అది ఒక మంచి వేదిక, ప్రతిభను పరిచయం చేసే గొప్ప సాధనం. కానీ ఆ వేదికను మనం ఎలా వాడుకుంటున్నామన్నదే ప్రశ్న. యువత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రీల్స్ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం పొందాలంటే ఒక్కటే మార్గం.. స్కూల్స్, కాలేజీల్లో ఈ విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్‌లైన్ యాక్టివిటీపై కొంతశాతం దృష్టిపెట్టాలి. సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫార్మ్‌లలో.. ప్రమాదకర కంటెంట్‌ను ప్రోత్సహించకుండా కఠిన నియమాలు విధించాలి.
Also Read: మనిషిలాగా ప్రవర్తించిన బుల్లి ఏనుగు.. కుర్చీలో కూర్చునేందుకు ప్రయత్నించి..?
రీల్‌కు వచ్చిన లైకుల కంటే, మీ జీవితమే విలువైనది. ఒక్క వీడియో వైరల్ కావడానికి తీసే ఓ చిన్న పొరపాటు, జీవితాంతం శోకాన్ని మిగిలించవచ్చు. రియల్ లైఫ్‌కి మించినది రీల్ కాదని ప్రతి యువకుడు గుర్తుంచుకోవాలి. రీల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి కానీ.. ప్రాణాలను పణంగా పెట్టే మోజుగా కాకూడదు.
సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని యువత..
రీల్స్ చేసి ఫేమస్ కావాలని ట్రైన్ పట్టాలపై పడుకున్న యువకుడు
పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!? అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన వీసీ సజ్జనార్
సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరమన్న సజ్జనార్
ఏదైనా… pic.twitter.com/XClb5RjmUV
— BIG TV Breaking News (@bigtvtelugu) July 22, 2025