Illu Illalu Pillalu Today Episode july 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి సమాధానం చెప్పకుండా బట్టు సర్దుకుంటూనే ఉంటుంది. నిన్నే అడిగేదీ.. ఏమైందీ అని అంటాడు చందు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నా అని అంటుంది. ఏమైందీ.. పుట్టింటికి వెళ్లిపోవడం ఏంటి? ఏమైంది అని అడుగుతాడు చందు. సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటుంది శ్రీవల్లి. ఇంతలో రామరాజు వచ్చి ఆగమ్మా అని ఆపుతాడు.. అదేంటమ్మా ఎక్కడికి బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నావు.. ఏమైంది అని అడుగుతాడు. మామయ్య గారండీ.. నేను ఇక్కడ ఉండలేనండీ.. ఈ ఇంట్లో ఉండటం నా వల్ల అస్సలు కావడం లేదండీ.. అందుకే మా పుట్టింటికి వెళ్లిపోతా మామయ్య గారండీ పెద్ద ఫిటింగే పెట్టేసింది శ్రీవల్లి.. అయితే మంచిది అనిపించుకోవడం కోసం కొత్త నాటకం మొదలుపెడుతుంది. అది నిజమే అనుకోని రేపు నా నిర్ణయం ఏంటో చెప్తాను అని రామరాజు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మద ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వచ్చి మాకు తల్లిదండ్రులు దగ్గర లేరు మీరే మాకు అన్ని అని ఎమోషనల్ గా కరిగిపోయేలా మాట్లాడతారు. వాళ్ళ మాటలకి వేదవతి కరిగిపోతుంటే.. శ్రీవల్లి వచ్చి అత్తయ్య గారిని ఇలా అంటారా అని మధ్యలో పుల్లలు పెట్టేస్తుంది. వేదవతి మనసులో మళ్లీ కోపాన్ని ద్వేషాన్ని పెరిగేలా చేస్తుంది.. అమ్మయ్య వేదవతి వీరిద్దరిపై సీరియస్ గానే ఉందని అనుకుంటుంది. వీళ్ళు ఇద్దరినీ ఇంట్లోంచి ఎలాగైనా బయటికి వెళ్లగొట్టాలని శ్రీవల్లి అనుకుంటుంది.
తర్వాత రోజు ఉదయం రామరాజు మిల్లుకు వెళ్లడానికి రెడీ అవుతాడు. అయితే తిరుపతి వచ్చి ఏంటి బావ ఈరోజు ఎంత తొందరగా రెడీ అయ్యావు అని కామెడీగా అడుగుతాడు. మీ బావకి నా చేతితో సంచిని తాళాలని తీసుకోకపోతే వెళ్లినట్టు కూడా ఉండదు రా నా సెంటిమెంట్ ని నేను ఎందుకు పక్కన పెట్టాలి అని వేదవతి అంటుంది.. ఉండండి నేను మీ బ్యాగులు తీసుకొస్తాను అని వేదవది అంటుంది. కానీ రామరాజు మాత్రం అమ్మ వల్లి అని పిలుస్తాడు. నేను మిల్లుకు వెళ్లాలమ్మ నా బ్యాగ్ ని తాళాలని తీసుకురావా అని అంటాడు. శ్రీవల్లి అలాగే మావయ్య గారు అని అంటుంది.
బ్యాగు, తాళాలను శ్రీవల్లి రామరాజుకు ఇస్తుంది. పిల్లలకు ఏదో ఒక గొడవ రావడం కామన్.. అలాగని నా పాతికేలా సెంటిమెంట్ ని మీరు పక్కన పెట్టేస్తారా అని వేదవతి అడుగుతుంది. శ్రీవల్లికి ఇవాళ నుంచి ఇంటి మర్యాద పరువు గురించి నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు కాబట్టి ఇంటికి పెద్ద కోడలుగా పెత్తనం నీ చేతిలో పెడుతున్నాను అని రామరాజు అంటాడు. నా పరువు గురించి, నాకు జరిగిన అవమానం గురించి నువ్వు చాలా బాధపడ్డావు. నా గురించి ఆలోచించేది నువ్వు ఒక్కదానివే అని రామరాజు అంటాడు.
అందుకే ఏంటి పెద్దగా నీకు ఆ పెత్తనాన్ని అప్పగిస్తున్నాను అని రామరాజు అంటాడు. తాళాలను శ్రీవల్లి చేతికి ఇస్తుంటే ప్రేమ నర్మదలు ఆగండి మావయ్య అత్తయ్య చేతినుండి ఆ తాళాలను వేరు చేయకండి. పాతికేలా నుంచి ఆమె ఇంటిని సక్రమంగా నడిపిస్తున్నారు. ఆమెలాగా ఇంటిని ఎవరు నడిపించరు. మా మీద కోపం ఉంటే మమ్మల్ని అనండి.. అంతేగాని ఈ పెత్తనాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఇవ్వకండి అత్తయ్య చేతిలోనే ఉంటే మంచిది అని అంటారు. ఇన్ని గొడవలు జరగడానికి కారణం నేనే మావయ్య మీరు నన్ను ఏదైనా శిక్షించండి అని ప్రేమ అంటుంది.
రామరాజు మీ ఇద్దరు నాతో మాట్లాడకండి. ఏది ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. ఇకమీదట మీ ఇద్దరు ఏదైనా చెప్పాలనుకుంటే వల్లితో చెప్పండి తను నాకు చెప్తుంది అని రామరాజు అంటాడు. మా అమ్మకు అన్ని దూరం అవడానికి కారణం నువ్వే అని ధీరజు ప్రేమపై కోపాన్ని పెంచుకుంటాడు. తర్వాత వల్లి ఇంటి పెత్తనం తన చేతికి వచ్చింది అని చెప్పడానికి బుల్లెట్ బండి పై హీరోయిన్ లాగా తన పుట్టింటికి వెళ్తుంది. వల్లిని చూసి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతారు.
Also Read : అక్షయ్ కు నిజం తెలిసిపోతుందా..? అడ్డంగా దొరికిపోయిన పల్లవి..
నువ్వు ఏం తమ్ముడు ఇలా వచ్చావు అని భాగ్యం అడుగుతుంది. ఇంటి తాళాలు నా చేతికి వచ్చాయి ఇది చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఆ తర్వాత నువ్వు నా కూతురు అనిపించుకున్నవే అని భాగ్యం మెచ్చుకుంటుంది.. ఆ ఇంట్లోనే ఇద్దరికి కోడల్ని బయటికి పంపించేసి ఆస్తి మొత్తాన్ని నీ చేతికి దక్కేలా చేసుకో అని భాగ్యం సలహా ఇస్తుందే. నువ్వే చెప్తే అదే చేస్తాను అమ్మా అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ప్రేమ అన్నారు కదా ఇద్దరూ మావయ్య ఇలా చేస్తారని అసలు ఊహించలేదు అక్క అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి ఇంట్లో వాళ్ళ పై పెత్తనం చాలా ఇస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.