OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో మలయాళం సినిమాలు, ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలు గా ముద్ర పడిపోయిన ఈ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తున్నాయి. సినిమా కథలు కూడా ప్రేక్షకులను అలరించే విధంగా తెర కెక్కిస్తున్నారు మేకర్స్. మహిళలు పోకిరిలతో ఎదుర్కొనే సమస్యలతో, ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
జీ 5 (Zee 5) లో
ఈ రివెంజ్ థ్రిల్లర్ మలయాళం మూవీ పేరు ‘ప్రతి పూవంకోజి‘ (Prathi poovankozhi). ఈ మూవీకి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించగా, ఇందులో రోషన్ ఆండ్రూస్, మంజు వారియర్, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. సెంట్రల్ పిక్చర్స్ ఈ మూవీని 20 డిసెంబర్ 2019న థియేటర్‌లలో విడుదల చేసింది. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ రీమేక్ హక్కులను బోనీ కపూర్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ మూవీ జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరోయిన్ చదువుకోవడానికి బస్సులో వెళుతూ ఉంటుంది. తను ఇంటిదగ్గర టైలరింగ్ పని కూడా చేస్తుంటుంది. ఒకరోజు హీరోయిన్ బస్సులో వెళుతుండగా ఒక వ్యక్తి ఆసభ్యకరంగా తాకుతూ ఉంటాడు. మరుసటి రోజు కూడా అలాగే చేయడంతో ఆ వ్యక్తిని గుర్తుపట్టి బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఈ క్రమంలో అతడు ఎవరో తెలుసుకోవాలని మార్కెట్ కి వెళ్తుంది. వాడు కొంతమందిని కొడుతూ రౌడీలా బిహేవ్ చేస్తుంటాడు. అయినా అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటుంది హీరోయిన్. అతనికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి వెళుతుండగా, కొంతమంది వ్యక్తులు ఆ రౌడీపై కత్తులతో దాడి చేస్తారు. కొనఊపిరితో కొట్టుకుంటున్న అతడిని హీరోయిన్ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. హీరోయిన్ మనసులో ఒకటి అనుకుంటుంది. అతనికి బుద్ధి చెప్పకుండా ప్రాణం పోకూడదని ఈ పని చేస్తుంది. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. నిజానికి అతన్ని చంపమని చెప్పిందే పోలీస్ ఆఫీసర్. మార్కెట్లో డబ్బులు వసూలు చేసే పనిలో రౌడీదే పై చేయి అవుతుంది. అతని అడ్డు తొలగిస్తే ఇన్స్పెక్టర్ మార్కెట్ ని తన చేతుల్లోకి వస్తుందని ఈ పని చేపిస్తాడు.
అయితే నేరం మాత్రం హీరోయిన్ పై వేయాలని చూస్తాడు. అతడు ప్రాణాలతో బయటపడటంతో, హీరోయిన్ కేసు నుంచి తప్పించుకోగలుగుతుంది. ఆ తర్వాత వాడికి బుద్ధి చెప్పాలని ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఇంటికి తాళం వేయడంతో, అతడు ఉన్నచోటు తెలుసుకొని అక్కడికి వెళుతుంది. మంచం మీద నడవలేని స్థితిలో పడుకున్న అతన్ని చూసి భార్య ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ను చూసిన ఆ రౌడీ కూడా ఏడుస్తాడు. తనకు దేవుడే శిక్ష వేశాడు అంటూ ఆ రౌడీ భార్య హీరోయిన్ తో అంటుంది. ఆ తర్వాత తిరిగి వచ్చి బస్సు ఎక్కిన హీరోయిన్ తో మరొక రౌడీ అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. చివరికి హీరోయిన్ అతనికి బుద్ధి చెబుతుందా? మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే జీ 5 (Zee 5) లో స్ట్రీమింగ్ అవుతున్న, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.