People Eating Train In China | జనాలు ఇటీవల ఫన్నీ వీడియోలకు బాగా అలవాటు పడ్డారు. ఎక్కడైనా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ విచిత్రంగా కనిపించే ప్రతిదాన్ని ఆస్వాదించాలని అందరూ భావిస్తారు. అందుకే పర్యటక ప్రదేశాల్లో ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేస్తుంటారు. కానీ విచిత్రంగా ఒక నగరంలో పర్యాటకులు వీడియోలు రికార్డ్ చేసేందుకు క్యూ కడుతున్నారు. వారంతా అక్కడ ఒక ట్రైన్ ని తినాలని ప్రయత్నిస్తుండడం విశేషం.
వివరాల్లోకి వెళితే.. చైనాలోని చాంగ్ ఖింగ్ నగరంలో ఇటీవల చాలామంది పర్యాటకులు లిజిబా రైల్వే స్టేషన్ కి కొద్ది దూరంలో నిలబడి వీడియోలు తీసేందుకు ఎగబడుతున్నారు. దీంతో అక్కడ పోలీసులు వారిని క్యూలో నిలబెట్టి వీడియోలు తీసుకోవడానికి అనుమతించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాంగ్ ఖింగ్ నగరంలోని లిజిబా స్టేషన్ కు కొద్ది దూరంలో జనం క్యూలో నిలబడి కెమెరాలకు పోజులిస్తూ ట్రైన్ ను మింగేస్తున్నారు. ఆ వీడియోలు చూస్తే.. అది నిజమేనేమోనని భ్రమ కలుగుతుంది. ఫోటోలలో కనిపిస్తున్నట్లు ఒక వ్యక్తి నోరు వెడల్పుగా తెరచి ఉంచగా.. అందులో ఎదురుగా వస్తున్న రైలు వెళ్లిపోతుంది. కానీ ఆ తరువాత బయటికి రాదు. ఎక్కడికి వెళ్లిపోతుందో కనబడదు. ఇదంతా ఒక ట్రిక్కు అని ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫొటోగ్రఫీ స్కిల్ అన్నమట.
Also read : జీవితకాలం పానిపూరి ఫ్రీ.. భలే బిజినెస్ ఐడియా గురూ!
అసలు ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. లిజిబా రైల్వే స్టేషన్ అచ్చం మన భారత దేశ మెట్రో స్టేషన్ లలానే ఉంటుంది. కానీ స్టేషన్ బయట నుంచి అది ఏదో ఒక భవనంలా తలపిస్తుంది. అయితే ఈ భవనం లా కనిపించే స్టేషన్ ఒక కొండ ప్రాంతంలో ఉండి.. చాలా పొడవుగా ఉంది. అందుకే అందులోకి ప్రవేశించే ట్రైన్ బయటికి వచ్చినా అది ఫొటోలో కనిపించదు. ఎందుకంటే అందరి కళ్లకు అది భవనంలా కనిపిస్తుంది. అయితే ఆ స్టేషన్ ముఖ ద్వారం వద్దకు దూరం నుంచి నిలబడి ప్రజలు నోరు సరిగ్గా పెట్టడంతో ట్రైన్ అతని నోటిలో ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్ లో లిట్ రెడ్ బుక్ అనే అకౌంట్ లో పోస్ట్ అయిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఒక్క రోజుకే 60,000కు పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇదే సీన్ తో చాలామంది చైనీయులు వందల వీడియోలు సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ తో ఈఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి.