BigTV English

Drunk and Drive Viral video: ఫుల్ గా త్రాగేశా! 500 తీసుకోండి, వదలండి! పెద్ద ప్లాన్ వేసిన మందుబాబు!

Drunk and Drive Viral video: ఫుల్ గా త్రాగేశా! 500 తీసుకోండి, వదలండి! పెద్ద ప్లాన్ వేసిన మందుబాబు!

Drunk and Drive Viral video: ఓ మందుబాబు చేసిన నిర్వాకం అంతా ఇంతా కాదు. పట్టపగలు ఫుల్లుగా తాగేసి, నడిరోడ్డుపై ద్విచక్ర వాహనం నడిపాడు. ఆ నగరంలో ఎప్పుడు ట్రాఫిక్ డ్యూటీలో ఉండే ట్రాఫిక్ పోలీసుల కంటపడ్డాడు. ఇంకేముంది మనోడు అసలు యవ్వారం బయటపడింది. అయితే ఆ మందు బాబు నీతి నిజాయితీగా ఫుల్లుగా త్రాగేశాను.. ప్లీజ్ 500 తీసుకోండి నన్ను వదిలేయండి.. అంటూ ఆ పోలీస్ అధికారికి లంచం నేరుగా ఇవ్వజూపాడు. పోలీసు అధికారి దీనితో షాక్కు గురై, ఆ మందు బాబును ఏమి చేశారో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.


ఈ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చుక్కలే!
ఏపీలోని విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పవచ్చు. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవింగ్ చేయడం, సీట్ బెల్ట్ ధరించకుండా కారు నడపడం, త్రిబుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వాటిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి జరిమానాల పర్వం సాగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై నగర ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

హెల్మెట్ పై విస్తృత అవగాహన
నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిరంతరం హెల్మెట్ ధారణ పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించి బైక్స్ నడిపిన వారిని అభినందించడం, అలాగే హెల్మెట్ ధారణ పాటించిన వారి చేత జరిమానా బదులు అప్పటికప్పుడు హెల్మెట్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడంతో నగరంలో హెల్మెట్ ధారణ పై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు సైతం విజయవాడ నగరంలో పూర్తి నిబంధనలను పాటిస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు.


ఇలాంటి స్థితిలో మందుబాబు ఏం చేశాడంటే?
ఇటీవల విజయవాడ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ ఎస్ఐ విధుల్లో ఉండి వాహనాల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అదే మార్గం గుండా వస్తు ఎదురుగా వస్తున్న మరో బైక్ ను ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వెంటనే సదరు ద్విచక్ర వాహనదారుడిని పట్టుకున్నారు.

Also Read: Visakhapatnam vs Vijayawada: ఏపీలో విశాఖ తర్వాతే విజయవాడ.. ఈ క్రెడిట్ ఆ నగరానికే ఎందుకు?

ఆ తర్వాత అతడి మాటలను బట్టి మద్యం సేవించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని పోలీసులు ప్రశ్నించగా.. తాను ఏకంగా మూడు క్వార్టర్లు తాగినట్లు, అయితే అత్యవసరంగా వెళ్లాల్సిన పని ఉందని సదరు మందుబాబు చెప్పుకొచ్చాడు. విజయవాడ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సహించేది లేదని, ప్రమాదం మీకు జరగడమే కాక.. ఎదురుగా వచ్చే వాహనదారులకు సైతం జరిగే అవకాశాలు ఉన్నట్లు సదరు విధుల్లో ఉన్న ఎస్ఐ అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.

ఏకంగా 500 ఇచ్చేందుకు ప్రయత్నం..
ఎస్సై అవగాహన కల్పిస్తున్న క్రమంలోనే మందుబాబు తన జేబులో ఉన్న 500 నోటు తీసి సైలెంట్ గా ఎస్సై చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఎందుకు ఈ డబ్బులు అంటూ ఎస్ఐ ప్రశ్నించగా.. సార్ తీసుకోండి వదిలేయండి అంటూ ఆ మందుబాబు ప్రాధేయపడ్డాడు. దీనిపై స్పందించిన ఎస్సై.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడమే తప్పు.. మరల లంచమిస్తూ మరో తప్పు చేస్తున్నావంటూ హెచ్చరించారు. కానీ మందు బాబు మాత్రం తాను అత్యవసరంగా వెళ్లాలని, డబ్బులు తీసుకుని వదిలివేయాలంటూ ప్రాధేయపడ్డాడు.

అంత అత్యవసరమైతే తానే వాహనాన్ని సమకూరుస్తానని, చట్ట ప్రకారం తాము చర్యలు తీసుకుంటామంటూ ఎస్సై వివరణ ఇచ్చారు. మొత్తం మీద మందు బాబు నిజాయితీని మాత్రం పోలీసులు అభినందించడం విశేషం. ఫుల్లుగా మద్యం సేవించిన మాట ఒప్పుకొని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు కూడా సదరు మందు బాబు సహకరించడం మరో విశేషం. ఎట్టకేలకు మందు బాబుకు నచ్చజెప్పి పోలీసులు కేసు రాసి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Related News

Viral News: స్కూల్‌ పై దావా వేసిన దొంగ.. నెలకు లక్షన్నర జీతం చెల్లిస్తున్న యాజమాన్యం!

Viral video: కబడ్డీ ఆడుతుండగా భారీ శబ్దంతో పిడుగు.. యువకులు పరుగో పరుగు.. వీడియో ఫుల్ వైరల్

Bird landing video: పైలట్లకు స్పెషల్ క్లాస్ చెప్పిన పక్షి.. వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ సీపీ!

Phone Limits: ఫోన్ కేవలం 2 గంటలే వాడాలట.. ఆ దేశంలో సరికొత్త రూల్, జనాలు ఏమైపోవాలి?

Wanaparthy Shocking: అభిమాన నాయకుడి పిలుపుతో చావు నుంచి లేచి వచ్చాడు! వనపర్తిలో అద్భుతం!

Viral Video: వీధి కుక్కలే పెళ్లి అతిథులు, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×