BigTV English

OTT Movie : ఈ మూవీని చూశాక లైఫ్ లో లిఫ్ట్ ఇవ్వరు, ఇచ్చినా తీసుకోరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్

OTT Movie : ఈ మూవీని చూశాక లైఫ్ లో లిఫ్ట్ ఇవ్వరు, ఇచ్చినా తీసుకోరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్స్

OTT Movie : షార్ట్ ఫిల్మ్ లతో ఎంతో మంది తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. కొన్ని నిమిషాల స్టోరీతోనే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. వీటికి జాతీయ అవార్డులు కూడా దక్కుతున్నాయి. అన్ని జానర్లలో ఈ షార్ట్ ఫిల్మ్స్ అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే షార్ట్ ఫిల్మ్ ఒక నిర్మానుష్య రోడ్డులో, ఇద్దరు అపరిచిత వ్యక్తుల మధ్య ఒక భయంకరమైన వాతావరణంలో జరుగుతుంది. ఇది ఒక షాకింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

ఈ హిందీ హారర్ షార్ట్ ఫిల్మ్ పేరు ‘రాహ్’ (Raah). 2015 లో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ కి ప్రతీక్ పయోధి దర్శకత్వం వహించారు. ఇందులో స్వర్ణిమా తెలంగ్, రిషి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ 16 నిమిషాల రన్‌టైమ్‌తో, ఒక భయంకరమైన రహదారి చుట్టూ తిరుగుతుంది. ఇది ఇద్దరు అపరిచితుల మధ్య జరిగే సంఘటనలను ఒక భయంకరమైన వాతావరణంలో చూపిస్తుంది. ఇది యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ కథ ఒక రాత్రి సమయంలో, “హాంటెడ్” రహదారిగా పిలవబడే ఒక నిర్మానుష్య రోడ్డు మీద జరుగుతుంది. ఒక వ్యక్తి (రిషి వర్మ), తన కారులో ఒక ఎయిర్ కండిషనర్ బాక్స్‌తో ప్రయాణిస్తూ, ఒక మహిళ (స్వర్ణిమా తెలంగ్)కు లిఫ్ట్ ఇస్తాడు. ఆమె ఈ రహదారి గురించి భయంకరమైన కథలను చెబుతూ అతనిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అతను కూడా ఆమెను భయపెట్టడానికి తన సొంత కథలను చెబుతాడు. వారి సంభాషణ మొదట ఉత్సాహంగా సాగినప్పటికీ, ఈ రహదారిలో గతంలో జరిగిన సంఘటనలు, వీళ్ళు ఒకరిని ఒకరు భయపెట్టుకునే ప్రయత్నాలు కథను ఒక ఆశ్చర్యకరమైన మలుపు వైపు నడిపిస్తాయి.

ఈ షార్ట్ ఫిల్మ్ హారర్ అంశాలను సస్పెన్స్‌తో నడిపిస్తూ, రహదారి చీకటి వాతావరణంలో ఒక భయంకరమైన అనుభవాన్ని సృష్టిస్తుంది. కథ ఒక  చిన్న ట్విస్ట్‌తో ముగుస్తుంది. అయితే ఇది ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. చివరికి ఆ రోడ్డులో ఏం జరుగుతుంది ? వీళ్ళు భయాలను ఊహించుకుని వెళ్తుంటారా ? గతంలో అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ షార్ట్ ఫిల్మ్ ను మిస్ కాకుండా చుడండి.

Read Also : పెళ్లి ఫిక్సయిన అమ్మాయిలు కిడ్నాప్… చేతులు నరికి, ముక్కలు ముక్కలుగా పారేస్తూ కిరాతకంగా చంపే సైకో కిల్లర్

Related News

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

Thriller Movie in OTT : ఇదేం సినిమా రా అయ్యా.. బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది… ఒంటరిగా చూడకండి..

OTT Movie : రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌తో 4.5 గ్యాంగ్ ఫైట్… రెస్పెక్ట్ కోసం పాలు, పూల మాఫియాలోకి… కితకితలు పెట్టే మలయాళ కామెడీ సిరీస్

OTT Movie : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×