BigTV English

Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ..

Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ..
Advertisement

Kiara Advani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా తల్లి దండ్రులు అయ్యారు. కొన్ని గంటల క్రితమే పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు తల్లిదండ్రులుగా మారడంతో వారి అభిమానులు వారిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం వారికి విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు..


బాలీవుడ్ లోకి మరో వారసురాలు.. 

ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లు అందరు ఆడబిడ్డకు జన్మనిస్తున్నారు. అలియాభట్, రణబీర్ కపూర్ జంటకు మొదటగా ఆడబిడ్డ పుట్టింది. ఇటీవల దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి మరో బుల్లి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. కియారా అద్వానీ కొన్ని గంటల క్రితమే బిడ్డకు జన్మనించింది. ఈ లెక్కన చూస్తే బాలీవుడ్ లో ఎక్కువగా ఆడపిల్లలకే జన్మనిచ్చారు. కియారా, సిద్దార్థ్ తల్లిదండ్రులుగా మారడంతో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు, సన్నిహితులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


కియారా, సిద్దార్థ్ పెళ్లి.. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు కూడా మంచి స్టార్స్.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2023 లో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన కియారా గతేడాది చివర్లో ప్రెగ్నెంట్ అనిఅభిమానులకు తీపి కబురు చెప్పుకొచ్చింది. ఇక సిద్దార్థ్.. భార్యను కాలు కిందపెట్టకుండా చూసుకుంటూ ఆమెకు ఏది కావాలన్నా ఇట్టే అందించి బెస్ట్ హస్బెండ్ అయ్యాడు. వీరిద్దరూ బాలీవుడ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

కియారా సినిమాలు.. 

బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ గా కోనసాగుతోంది కియారా.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగుతెరకు పరిచయమై మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తరువాత వినయ విధేయ రామ సినిమాతో చరణ్ సరసన జతకట్టి ప్లాప్ ను మూటకట్టుకుంది.. రీసెంట్ గా రామ్, చరణ్ సరసన గేమ్ చేంజర్ మూవీలో నటించి మరో ప్లాప్ మూవీని అందుకుంది. సిద్ , కియారా కెరీర్ల విషయానికొస్తే.. ప్రస్తుతం కియారా వార్ 2 లో నటిస్తోంది. సిద్దార్థ్.. పరమ సుందరి సినిమాతో బిజీగా ఉన్నారు. కియారా బాలీవుడ్ లో బాగా సక్సెస్ అయ్యింది. కానీ తెలుగులో మాత్రం మహేష్ సినిమా తర్వాత ఒక్క హిట్ మూవీ కూడా ఈమె ఖాతాలో పడలేదు. అయిన ఆమెకు ఇక్కడ క్రేజ్ ఎక్కువగానే ఉంది. మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక  ప్రస్తుతం ఓ ఆరు నెలలు బిడ్డ కోసం కేటాయించే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ సినిమాలను అనౌన్స్ చేస్తుందని టాక్..

Related News

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Big Stories

×