BIG TV LIVE Originals: అమెరికా. ప్రతి ఒక్కరు ఈ పేరు వినగానే ఓ అద్భుతంగా ఫీలవుతారు. తాము కాకపోయినా, తమ పిల్లలు అక్కడ సెటిల్ కావాలని భావిస్తారు. ఒక్కసారి అమెరికాకు వెళ్తే, వాళ్ల లైఫ్ సెటిల్ అవుతుందని భావిస్తారు. అందుకే, ఎన్ని కష్టాలు ఎదరైనా తమ పిల్లలను అమెరికాకు పంపిస్తారు. అక్కడికి వెళ్లి చాలా మంది చదువుకుంటూనే పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటారు. వాస్తవానికి అలా చేయడం నేరం అయినప్పటికీ ఇండియన్స్ చెందిన రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర కంపెనీల్లో పని చేస్తూనే ఉంటారు. కానీ, అమెరికాలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి చాలా మంది పట్టించుకోరు. అక్కడ ఉన్న జాతి వైరం, గన్ కల్చర్ ఎంతో మంది ప్రాణాలు తీస్తుంటుంది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే, కొన్ని రాష్ట్రాల్లో మినహా, చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. కనీసం, అక్కడి పరిస్థితుల గురించి ఇక్కడి వాళ్లకు తెలియదు. తెలిసినా, తెలియనట్లు వ్యవహరిస్తారు.
అమెరికాలో ఆయా రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు!
⦿ అలబామా: అమెరికాలో వాయిలెన్స్ అని పేరు వినగానే అలబామా గుర్తుకు వస్తుంది. ఆ దేశంలో అత్యంత వాయెలెంట్ క్రైమ్ రేట్ ఉన్న రాష్ట్రం ఇదే.
⦿ అలస్కా: అమెరికాలో అత్యంత ఆధునిక పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మంది అదృశ్యం అవుతుంటారు. ఇంతకీ వాళ్లు ఏమయ్యారు? అనే విషయాన్ని కనిపెట్టడంలో అక్కడి పోలీసులు కూడా సక్సెస్ కాలేకపోతున్నారు.
⦿ ఆరిజోనా: అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే రాష్ట్రం. ఇక్కడ వేడికి జనాల చర్మం కాలిపోతుంది. బొబ్బలు వస్తాయి.
⦿ ఆర్కాన్ సస్: అమెరికాలో పేదరికం లేదు, చక్కటి వైద్యం లభిస్తుందని అందరూ భావిస్తారు. కానీ, హెల్త్ కేర్, ప్రావర్టీలో అత్యంత వరస్ట్ స్టేట్.
⦿ కాలిఫోర్నియా: ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఆరు అంకెల సాలరీ ఉన్న వాళ్లు కూడా ఇల్లు కొనలేని పరిస్థితి ఉంటుంది.
⦿ కొలరాడో: ప్రతి ఏటా ఇక్కడ కార్చిచ్చు రగులుకుంటుంది. వేలాది ఎకరాల అటవీ భూములు బూడిద అవుతుంటాయి. ఈ మంటలు జనావాసాల్లోకి విస్తరించి వేలాది ఇండ్లు మంటల్లో తగలబడిపోతాయి.
⦿ కనెక్టికట్: ఇక్కడ అత్యంత ధనికలతో పాటు అత్యంత పేదవాళ్లు ఉంటారు. ఉన్నవాళ్లు మరింత ధనవంతులుగా, లేనివాళ్లు మరింత పేదవారిగా మారిపోతున్నారు.
⦿ డెలావేర్: అమెరికాలోని అత్యంత చిన్న రాష్ట్రం. కానీ, అత్యంత ఎక్కువ క్యాన్సర్ రోగులు ఉన్న రాష్ట్రం.
Read Also: 4 రోజులు.. 9 రాష్ట్రాలు…దేశంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా?
⦿ ఫ్లోరిడా: ఇక్కడ ‘ఫ్లోరిడా మ్యాన్’ హెడ్ లైన్స్ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. ఎక్కువ క్రైమ్, అరెస్టులు ఉంటాయి.
⦿ జార్జియా: అమెరికాలో అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని చెప్పుకుంటారు. కానీ, ఇక్కడ ట్రాఫిక్ వాయెలేషన్స్ ఎక్కువగా ఉంటాయి.
⦿ హవాయి: ఇక్కడ నిత్యవసర సరుకుల ధరలు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఉంటాయి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఖతార్ రోడ్లు బ్లాక్ కలర్ లో కాకుండా బ్లూ కలర్ లో కనిపిస్తాయి.. ఎందుకో తెలుసా?