Viral News : మనం చాలా మందిని చూస్తుంటాం.. పరీక్షలు అంటే చాలు ఎక్కడ లేని నొప్పులొస్తాయి. కానీ.. తన పేదరికం, చదువుకుంటే కానీ జీవితం మారదనే ఆలోచనతో ఓ కుర్రాడు.. చేసిన సాహసం నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అతని సాహసం దగ్గర నుంచి, ఎదురైన సమస్యకు పరిష్కారం వెతికిన తీరు వరకు ఈ కుర్రాడి ఆలోచనలతో ఎన్నో విలువైన పాఠాలు చెప్పొచ్చు అంటున్నారు.. వ్యక్తిత్వవికాస బోధకులు. మరి, ఇంత మందిని మెప్పించిన ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా.. తెలిస్తే మీరు గాల్లో తేలిపోతారు. అవును.. అతనేం చేశాడో మీరూ తెలుసుకోండి మరి..
దక్షిణ మహారాష్ట్ర్లోని పంచగని నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన కొండ చరియల ప్రాంతం..హారిసన్స్ ఫాలీ. అక్కడికి వచ్చే పర్యాటకులకు వడ్డిస్తూ రోడ్డు పక్కన హోటల్ లో పనిచేస్తున్నాడు.. సమర్థ్ మహాంగడే అనే కుర్రాడు. నిండా 19 ఏళ్లు కూడా లేని ఆ కుర్రాడికి.. అలా హోటల్ లో పని చేస్తేనే కుటుంబ ఖర్చులు తీరుతాయి. అంతలోనే.. సమర్త ఫోన్ రింగైంది. ఎవరా అని చూస్తే.. అటువైపు నుంచి “సమర్త్, నువ్వు ఎక్కడ ఉన్నావు? పరీక్ష ప్రారంభమైంది. నువ్వింకా రాలేదు.” అంటూ అతని స్నేహితులు కంగారుగా అడుగుతున్నారు. వారి గొంతులో ఆ తొందరపాటు, పరీక్ష మొదలైన కంగారు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అంతే.. సమర్త్ కు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది. 19 ఏళ్ల బికామ్ మొదటి సంవత్సరం విద్యార్థి సమర్త్.. వాస్తవానికి అతని యూనివర్సిటీ తొలి సెమిస్టర్ పరీక్ష తొలుత వాయిదా పడింది. కానీ.. మరోసారి చేసిన మార్పుల్లో పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆ విషయం అతనికి తెలియకపోవడంతో.. పరీక్ష లేదనుకుని హోటళ్లో తన పని తాను చేసుకుంటున్నాడు.
మెరుపులాంటి ఆలోచన
విషయం తెలిసిన వెంటనే.. అతనికి తొలుత భయం వేసింది. అతనున్న దగ్గర నుంచి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటే 15 కి.మీ చేరుకోవాలి. పరీక్షా కేంద్రం పసర్ని అనే గ్రామంలో ఉంది. అతనున్న దగ్గర నుంచి కొండ దిగువలో ఆ గ్రామం ఉంది. ఆ కొండ రోడ్లు నిటారుగా, వంపుతిరిగిన పసర్ని ఘాట్ లో ప్రయాణిస్తే.. పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు సులువుగా 30 నిముషాలు పైగానే పడుతుంది. అదే.. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే మరింత సమయం పట్టొచ్చు. ప్రస్తుతానికి అతనికి సమయం లేదు. కానీ.. ఎలాగైనా పరీక్ష రాసి తీరాలి. లేదంటే.. మరోసారి పరీక్షలు రాయాలి, మరోసారి ఫీజు కట్టాలి. అతని స్థోమతకు అది మించిన వ్యవహారం. అందుకే.. మెరుపులా అతని ఆలోచనలు పరుగెత్తుతున్నాయి. ఏం చేస్తే చేరుకోగలను అని ఆలోచిస్తున్న అతనికి.. ఓ మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అంతే.. మరో 15 నిముషాల్లో మూసివేస్తున్న పరీక్షా హాల్ తలుపుల నుంచి సమర్త్ వేగంగా దూసుకొచ్చాడు. అతడిని చూస్తూ.. అంతా ఒక్కాసారిగా షాక్ అయ్యారు.
ఎలా చేరుకున్నాడంటే..
సమర్త్ కు ఎలాగైనా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఎదురుగా.. అడ్వెంచర్ విమానాలను నడిపిన పారాగ్లైడింగ్ శిక్షకుడు గోవింద్ యెవాలే నిలబడి ఉన్నాడు. B.Com మొదటి సంవత్సరం విద్యార్థి సమర్త్ అతని వైపు పరుగెత్తాడు. “భౌ, నాకు మీ సహాయం కావాలి. నాకు 10 నిమిషాల్లో పరీక్ష ఉంది. నన్ను ఎగ్జామ్ హాల్ కి తీసుకెళ్లగలరా?” అంటూ అడిగారు. గోవింద్ కు మొదట చిరాకు కలిగింది.. పరీక్షను ఎలా మర్చిపోయావ్ అంటూ కోపంతో అడుగుతూనే.. ఎదురుగా ఉన్న సమర్త్ కళ్ళలో ఉన్న పట్టుదలకు కాదనలేకపోయాడు. ఒక క్షణం సంకోచించిన తర్వాత, గోవింద్ తన పారాగ్లైడర్లలో ఒకదానిపై చేయి ఊపాడు. లోపలికి రా అంటూ.. అసిస్టెంట్ ను ఆదేశించాడు. అంతే.. పరుగున వచ్చిన అసిస్టెంట్.. తన పారాచూట్ జీనులోని లాక్కున్నారు. ఆపై.. గాలి వాలుగా పరుగెత్తుతూ.. వారు కొండపై పారాగ్లైండింగ్ చేస్తూ.. 5 నిమిషాల్లో పరీక్షా కేంద్రాన్ని చేరుకున్నారు. పైలట్ నైపుణ్యంగా గ్లైడర్‌ను నడిపి.. సమర్త్ ను పాఠశాల మైదానంలోకి నేరుగా తీసుకొచ్చి దించాడు. అంతే.. పరీక్షా కేంద్రాన్ని చేరుకున్న సమర్త్.. తన బకిల్‌ను విప్పి పరీక్షా కేంద్రానికి పరిగెత్తాడు. వేగంగా ఊపిరి తీసుకుంటూ.. పరీక్షా హాలుకు చేరుకున్నాడు. సరిగ్గా.. ప్రశ్నాపత్రాలు అందజేస్తున్న సమయానికి తలుపుల గుండా పరుగెత్తుకుంటూ సమర్త్ లోపలికి ప్రవేశించాడు.
Also read : జీవితకాలం పానిపూరి ఫ్రీ.. భలే బిజినెస్ ఐడియా గురూ!
అతని పారా గ్లైడింగ్ గురించి తెలుసుకున్న అధికారులు.. పరీక్షలు రాయాలనే సమర్త్ పట్టదలను మెచ్చుకుంటున్నారు. వాస్తవానికి.. పసర్ని ఘాట్ వెంబడి ఆ రోజు ట్రాఫిక్ రద్దీ సాధారణంగానే ఉన్నట్లు సతారా ఎస్పీ సమీర్ షేక్ తెలిపారు. అయినా.. ఒక పేద విద్యార్థి దృఢ సంకల్పం ముందు ప్రతీ సెకను ముఖ్యమైనదే అంటూ.. మెచ్చుకున్నారు. ఇప్పుడు.. చెప్పండి, మనం అయితే, ఇలాంటి సాహసం చేసే వాళ్లమా.. లేదా మరోసారి చూసుకుందాంలే అని పూరుకుంటామా.. ఏంతైనా సమర్త్ ధైర్యానికి.. అతడిని అభినందనలు తెలపాల్సిందే కదా.