కొంత మంది చేసే పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. పాపులర్ అయ్యేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. తాజాగా రాస్థాన్ లోని ఓ వ్యక్తి కూడా ఇలాంటి పనే చేశాడు. తన కారుకు కాయిన్స్ తో డెకరేట్ చేశాడు. ఇందుకోసం బోలెడు చిల్లర ఉపయోగించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలు గా స్పందిస్తున్నారు.
కాయిన్స్ తో కారుకు డెకరేషన్
తమ కార్లను వింత వింతగా అలంకరించి చాలా మంది వార్తల్లో నిలిచారు. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాంటి పనే చేశాడు. ఒక్క రూపాయి, రెండు రూపాయల కాయిన్స్ తో కారు అంతటినీ అలంకరించాడు. ఇందుకోసం 50 వేల కాయిన్స్ పట్టగా, డెకరేట్ చేడానికి ఏకంగా వారం రోజుల సమయం తీసుకున్నారట. ఎండలో ఉంచిన ఈ కారు సూర్యకిరణాలు పడి చమక్ చమక్ అంటూ మెరుస్తోంది. చూసే వాళ్లకు కనువిందు చేస్తోంది. ఇప్పుడు కాయిన్స్ తో డెకరేట్ చేసిన ఈ షిఫ్ట్ డిజైర్ కారు రాజస్థాన్ లో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఎవరూ చూసినా ఈ కారు గురించే మాట్లాడుకుంటున్నారు.
సోషల్ మీడియాలో జోరుగా మీమ్స్..
@experiment_king అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియో షేర్ చేయబడింది. ‘పైసే వాలీ కారు’ అంటూ ఈ వీడియోను పోస్టు చేశారు. ఇక ఈ కారుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీగా స్పందిస్తుంటే, మరికొంత మంది ఇందే పైత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “దయ చేసి మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగకండి. ఒకవేళ ఆగితే బిచ్చగాళ్లు మీ కాయిన్స్ అన్నీ దోచుకుంటారు” అని ఓ వ్యక్తి ఫన్నీగా కామెంట్ పెట్టాడు. “ఎవర్రా మీరంతా? ఎలా వస్తాయి రా మీకు ఇలాంటి ఐడియాలు” అంటూ ఫన్ చేస్తున్నారు. “డబ్బులు ఎక్కువ అయితే ఎవరికైనా పేదవారికి పంచిపెట్టండి. అంతేకానీ, ఇలా వేస్ట్ చేయడం ఎందుకు?” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ కారు ఇన్ కం టాక్స్ వాళ్ల కంటికి కనబడనీయకండి. ఒకవేళ వాళ్లు చూస్తే, నీ కారు మాయం అవుతుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఇక గత ఏడాది చిప్స్ ప్యాకెట్లతో అలంకరించిన కారులో పెళ్లి కొడుకులో వచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పెళ్లి కొడుకు సాధారణంగా పూలు, బెలూన్లతో అలంకరించిన కారులో వస్తాడు. కానీ, చిప్స్ ప్యాకెట్స్ అలంకరించిన కారులో రావడం అందరినీ ఆకట్టుకుంది. గత డిసెంబర్ల ఓ అమెరికాలోని ఫోర్డ్ ముస్తాంగ్ కారు అద్భుతమైన క్రిస్మస్ లైట్లతో అలంకరించబడి ఆకట్టుకుంది. అయితే, ఇలా చేయడం ప్రమాదకరం అని హైవే అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కారు నుంచి క్రిస్మస్ లైట్లు తొలగించారు. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. కొద్ది సంవత్సరాల క్రితం తన ఖరీదైన కారుకు పేడపూత పూయడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది.
Read Also: దివికేగిన ఆ ప్రముఖులు.. కుంభమేళాలో స్నానమాచరిస్తే? పిచ్చెక్కిస్తున్న AI వీడియోలు!
February 14,2025 18:26 pm