Harsha Sai: కొన్నాళ్ల నుండి టాలీవుడ్‌లో లైంగిక వేధింపుల కేసులు ఎక్కువవుతున్నాయి. అందులో ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ లిస్ట్‌లో హర్ష సాయి కూడా ఒకడు. తన దగ్గర నుండి రూ.2 కోట్ల డబ్బు తీసుకోవడంతో పాటు తనను లైంగికంగా వేధించాడంటూ ఒక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో వెంటనే హర్ష సాయిపై కేసును నమోదు చేశారు పోలీసులు. అప్పటినుండి ఇప్పటివరకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ యూట్యూబర్. ఇప్పటికే పలుమార్లు తన బెయిల్ పిటీషన్ రిజెక్ట్ అవ్వగా ఫైనల్‌గా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టుగా హైకోర్టు తీర్పునిచ్చింది.
ఇండియాలో లేడా.?
హర్ష సాయి (Harsha Sai)పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయినప్పటి నుండి అసలు తను ఎక్కడా కనిపించడం లేదు. తనపై కేసు నమోదయిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే తాను ఏ తప్పు చేయలేదని, న్యాయంగా పోరాడడానికి తాను సిద్ధమని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ షేర్ చేశాడు హర్ష. ఆ తర్వాత అసలు తన జాడే లేదు. పోలీసులు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి ఎంత గాలించినా తన ఆచూకీ లభించలేదు. అదే సమయంలో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినా లాభం లేకుండా పోయింది. మొత్తానికి అసలు తను ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడంతో ఇండియా వదిలేసి పారిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ దేనిపై క్లారిటీ లేదు.
Also Read: డబ్బింగ్ సినిమాల కంటే దారుణమైన స్థితిలో కిరణ్ అబ్బవరం.. ఇది పోయినట్టేనా.?
చీటింగ్ కేసు
హర్ష సాయిను పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు నుండే తను తన లాయర్ ద్వారా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఇప్పటికే పలుమార్లు ఈ బెయిల్ రిజెక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే హర్ష సాయితో పాటు తన తండ్రిపై కూడా కేసు నమోదు చేసింది బాధితురాలు. ఆర్థికంగా తనను మోసం చేసే విషయంలో తండ్రీకొడుకులు ఇద్దరూ భాగమే అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టగా ఇన్నాళ్లకు వారి ప్రయత్నం ఫలించింది. కానీ ఇప్పటికే హర్ష సాయిపై లైంగిక వేధింపుల కేసుతో పాటు చీటింగ్ కేసు కూడా నమోదయ్యింది.
బెట్టింగ్ మాఫియా కూడా
యూట్యూబర్ హర్ష సాయి అవసరమైన వారికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. కానీ బాధితురాలు ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే అసలు విషయం బయటపడింది. తను ఆర్థికంగా వెనకబడిన వారికి సాయం చేస్తున్నట్టుగా చూపించడం అంతా స్కామే అని తేలిపోయింది. అంతే కాకుండా కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సపోర్ట్‌తో తను ఒక పెద్ద బెట్టింగ్ మాఫియాను నడిపిస్తున్నట్టుగా ఆధారాలతో సహా బయటికొచ్చింది. అలా వచ్చిన డబ్బులతోనే తాను ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. దానికోసమే తన దగ్గర కూడా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని బాధితురాలు చెప్పుకొచ్చింది.