South Africa vs India, 1st T20I: టీమిండియా ( Team India) వర్సెస్ సౌత్ ఆఫ్రికా ( South Africa ) జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అంటే రేపటి నుంచి సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలో టీమిండియా… మరో సమరానికి సిద్ధం కానుంది అన్నమాట. న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మొన్నటి వరకు టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్లో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ టెస్ట్ సిరీస్ కోల్పోవడమే కాకుండా… వైట్ వాష్ అయింది.
Also Read: Gelenn Maxwell: మళ్లీ RCBలోకి గ్లెన్ మాక్స్‌వెల్… ఎన్ని కోట్లు అంటే?
Also Read: IPL 2025: వేలంలోకి 42 ఏళ్ల అండర్సన్..రూ. 2 కోట్ల ప్లేయర్లు వీళ్లే ?
ఆడిన మూడు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయింది ఈ టీమ్ ఇండియా. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అర్హతలను సంక్లిష్టం చేసుకుంది టీమిండియా. అయితే ఇలాంటి పరిణామాలు నేపథ్యంలో… మరో టోర్నమెంటుకు సిద్ధమైంది టీమిండియా జట్టు. టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య t20 ల సిరీస్… రేపటి నుంచి ప్రారంభం కానుంది.
ఈ టోర్నమెంట్కు కెప్టెన్గా సూర్య కుమార్ యాదవ్ ( Surya kumar yadav) వ్యవహరించబోతున్నాడు. నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు ( South Africa) వెళ్ళింది టీం ఇండియా. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా చేరుకున్న టీమిండియా… ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. అయితే ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే టి20 మ్యాచ్లు రాత్రి 8:30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
భారత కాలమానం ప్రకారం.. ఎనిమిదిన్నర గంటలకు మ్యాచ్ కచ్చితంగా ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టి20 మ్యాచ్ డర్బన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టి20 సిరీస్ Sports18 నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతుంది. అలాగే… JioCinema యాప్ ఉచితంగా చూడొచచు.
Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ స్క్వాడ్: ఐడెన్ మార్క్రామ్ (సి), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, పాట్రిక్ క్రుగర్, డోనోవన్ ఫెరీరా, హెన్రిచ్ క్లాసెన్, ర్యాన్ రికెల్టన్, ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, మిహ్లాలీ మ్పయోంగ్వానా,
భారత జట్టు ప్లేయింగ్ స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్ (c), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), తిలక్ వర్మ, జితేష్ శర్మ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్‌ఖాన్, దయాల్, రింకూ సింగ్