Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. కొద్ది నెలల క్రితం రైల్లో ఓ యువజంట ముద్దులు పెట్టుకుంటూ సంచలనం సృష్టించగా, రీసెంట్ గా ఓ వ్యక్తి ఏకంగా మెట్రోలో పడుకుని జర్నీ చేస్తూ కనిపించాడు. రకరకాల సంఘటనలతో తరచుగా దేశ రాజధాని మెట్రో రైల్ హెడ్ లైన్స్ లోకి ఎక్కుతున్నది. తాజాగా ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కదులుతున్న రైల్లో ఏకంగా ప్రయాణీకులు కొట్లాడ్డం అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెట్రో రైల్లో కొట్లాడుకున్న ప్రయాణీకులు
తాజాగా మెట్రో రైల్లో కొంత మంది పెద్ద మనుషులు గొడవకు దిగారు. ఓ మెట్రో స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన కాసేపటికే గొడవ మొదలయ్యింది. ఓ మహిళ, మరో పురుషుడి మధ్య మాట మాట పెరిగింది. ఇద్దరు ఒకరి మీదికి మరొకరు దూసుకెళ్లారు. ఇద్దరూ తిట్టుకుంటూ కొట్టుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి సదరు మహిళ ఓ కుర్రాడిని బయటి నుంచి వస్తూనే ఏదో మాట అన్నది. అంతేకాదు, అతడి మీదికి చెయ్యెత్తి కొట్టేందుకు పోయింది. వెంటనే ఆ కుర్రాడి తండ్రి ఆమెను అడ్డుకున్నాడు. అతడిపైనా ఆమె గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆమెకు ఆమె భర్త సపోర్టుగా రాగా, కుర్రాడికి అతడి తండ్రి సపోర్టుగా వచ్చాడు. అందరూ కలిసి రైల్లో పెద్ద గొడవ పెట్టుకున్నారు. పక్కవాళ్లు జోక్యం చేసుకుని ఈ ఫైటింగ్ ఆపే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రైలు దిగేంత వరకు వారి గొడవ కొనసాగుతూనే ఉంది.
Kalesh inside Delhi metro over push and shove
pic.twitter.com/QU3V9HaKUt— Ghar Ke Kalesh (@gharkekalesh) November 6, 2024
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఢిల్లీ మెట్రో గొడవకు సంబంధించిన వీడియో ‘ఘర్కేకలేష్’ అనే హ్యాండిల్ ద్వారా Xలో షేర్ అయ్యింది. ‘మెట్రో లోపల పంచాయితీ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 వేలకుపైగా వ్యూస్ సాధించింది. కొంత మంది ఈ వీడియోకు హిలేరియస్ కామెంట్స్ పెట్టారు. “హే.. మీ గొడవ ఆపండి. అక్కడ ట్రంప్ గెలుస్తున్నాడు. ఇక్కడ మీ ఫైటింగ్ మంచిది కాదు” అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు. “ఇకపై ఢిల్లీ మెట్రో పేరును ‘కలాష్ రైలు’గా మార్చాలి. ఇలాంటి ఘటనలు ఈ రైల్లో కామన్ గా జరుగుతున్నాయి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇది రోజూ జరిగే తంతే, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని ఇంకో వ్యక్తి వ్యాఖ్యానించాడు. “ఈ వ్యక్తులు కనీసం పక్కవాళ్లు చూస్తున్నారనే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బయటకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఎలా?” మరో వ్యక్తి తన కోపాన్ని వెళ్లగక్కాడు. “వీరిద్దరిని పబ్లిక్ న్యూసెన్స్ కింద తీసుకెళ్లి లాకప్ లో పడేస్తే బాగుంటుంది” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో ఢిల్లీ మెట్రో పరువు తీస్తోంది.
Read Also: బాబూ! అది స్లీపర్ బెర్త్ కాదు, మెట్రో రైల్- మరీ అలా పడుకుంటే ఎలా?