E-Paper
Advertisement

Movie Theaters : నిర్మాతలు మారారు.. మరి థియేటర్స్ ఓనర్స్ పరిస్థితేంటి?

Movie Theaters : నిర్మాతలు మారారు.. మరి థియేటర్స్ ఓనర్స్ పరిస్థితేంటి?
Advertisement

Movie Theaters : గత కొన్ని రోజుల క్రితం… పైరసీకి కారణం ఎవరు అనే ఒక ఆర్టికల్‌లో చూశాం. అందులో మారాల్సింది ఎవరు.. ప్రజలా..? నిర్మాతలా..? థియేటర్స్ ఓనర్సా ? అంటూ కాస్త డీటైల్డ్‌గా చర్చించుకున్నాం.

అందులో మారాల్సిన వారిలో నిర్మాతలు… థియేర్స్ ఓనర్స్ ఉన్నారు. వీరు మారితే… ప్రజలు ఆటోమెటిక్‌గా మారుతారు అని కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నిర్మాతలు మారారు. ఈ వారం రిలీజ్ కాబోయే రాజ్ వెడ్స్ రాంబాయ్ మూవీకి ఈ టికెట్ ధరలు తగ్గించారు. సింగిల్స్ థియేటర్స్‌లో టికెట్ ధర కేవలం 99 రూపాయలు మాత్రమే. ఇక మల్టిప్లేక్స్‌లో అయితే ఒక టికెట్ ధర 105 రూపాయలే. నిజానికి ఇది మంచి నిర్ణయం. గ్రామాల్లో ఉండే ఆడియన్స్ థియేటర్స్ గడప తొక్కేలా చేసే నిర్ణయం. ఎక్కువ మంది సినిమా చేసేలా తీసుకున్న నిర్ణయం.

Advertisement

నిర్మాతలు మారితే ఎలా ఉంటుందో.. ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ ఫలితంతో తెలిసిపోతుంది. దీని తర్వాత నిర్మాతలు అందరూ ఇలా ఆలోచించే అవకాశం వస్తుంది. ఇక్కడి వరకు బానే ఉంది. టికెట్స్ ధరలు ఈ మూవీ వరకు అయితే తగ్గాయి.

మల్టీప్లెక్స్‌ల్లో ఇది పరిస్థితి..

మరి సినిమా థియేటర్స్‌కి వెళ్లిన తర్వాత జరిగే దాని పరిస్థితేంటి..? ఒక వ్యక్తి ఇదే రాజ్ వెడ్స్ రాంబాయ్ సినిమా కోసం మల్టీప్లెక్స్‌కి వెళ్తే… టికెట్ ధర ఇప్పుడు 105 రూపాయలు. కానీ, ఇంటర్వెల్ తర్వాత స్నాక్స్ అంటే… ఇక జేబుకు మాత్రమే కాదు.. గుండెకు కూడా చిల్లు పడాల్సందే. అలా ఉంటాయి అక్కడ ధరలు.

Advertisement

మినిమింలో మినిమిం… స్మాల్ ప్యాకెజ్ తీసుకున్నా… 650 రూపాయలకు పైనే ఉంటుంది. అంటే ఈ పాప్‌కార్న్ ప్యాకెజ్ ఇంకో 6 సినిమా టికెట్స్ కొనుక్కోవచ్చు. కనీసం వాటర్ బాటీల్ కొనుక్కోవాలి అని అనుకున్నా… దాదాపు 70 రూపాయల వరకు పెట్టాల్సిందే. సినిమా చూడటానికి వచ్చిన ఆడియన్‌ను నిలువున దోచుకుంటున్నాయి ఈ మల్టీ ప్లెక్స్‌‌లు.

సింగిల్ స్క్రీన్స్ తక్కువేం కాదు…

మల్టీఫ్లెక్స్ అలా ఉంటే… సింగిల్ స్క్రీన్స్ ఏం తక్కువేం కాదు. అక్కడ కూడా ఆడియన్స్ జేబు చిల్లు పడాల్సిందే అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే మల్టీఫ్లెక్స్ కాస్త ఎక్కువ, ఈ సింగిల్స్ థియేటర్స్‌లో కాస్త తక్కువ అంతే. దోపిడి అయితే మాత్రం వెరీ కామన్.

సింగిల్ స్క్రీన్స్‌లో వాటర్ బాటీల్, అక్కడ ఉండే కూల్ డ్రింగ్స్, సమోసా, పాప్‌కార్న్ ఇలా అన్నీ కూడా MPR కంటే దాదాపు రెట్టింపు ధరలో ఉంటాయి. సాధారణంగా సింగిల్ స్క్రీన్స్‌కు మధ్యతరగతి ఆడియన్స్ వస్తూ ఉంటారు. వాళ్లు కొనేవి.. MPR కి రెట్టింపు ధరలో ఉంటే వాళ్లు మళ్లీ థియేటర్స్ వైపు వస్తారా?

కాబట్టి… నిర్మాతలు ఒక్కరే కాదు.. థియేటర్స్ ఓనర్స్ కూడా మారాల్సిన టైం వచ్చింది. థియేటర్స్ లోపల ఉండే స్నాక్స్‌ను కూడా అందుబాటు ధరలో, MRP ధరలో ఉంచాలి. ఇలా చేస్తే ఐ బొమ్మ కాదు.. ఏ బొమ్మ వచ్చినా… ప్రజలు పైరసీ ఎంకరైజ్ చేయరు.

Read More :  పైరసీని పూర్తిగా కట్టడి చేయాలంటే… ఈ మార్పులు జరగాలి 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×