Viral Video: కోతులు చేసే గాలి పనులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. చెట్టు కొమ్మల మీద దూకడం, ఇంటి గోడల మీద పరిగెత్తడం, కొన్నిసార్లు దారి గుండా పోయే జనాలను భయపెట్టడం.. ఒకటేమిటీ.. వాటి అల్లరి పనుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. తాజాగా ఓ కోతి చేసిన పనికి ఏకంగా కారు టాప్ పగిలిపోయింది. ఇంతకీ ఆ కోతి ఏం చేసిందో మీరూ చూసేయండి..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
చూశారు కదా.. ఇదే ఆ కోతి చేసిన పని. పై నుంచి నేరుగా కారు సన్ రూఫ్ మీద పడిపోయింది. చూస్తుండగానే సన్ రూఫ్ గ్లాస్ ముక్కలు ముక్కలు అయిపోయింది. కారు లోపలికి పడిపోయింది. వెంటనే తేరుకుని పైకి ఎక్కింది. అక్కడి నుంచి బతుకు జీవుగా అంటూ పారిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జరిగింది. నిజానికి అక్కడ కోతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ కోతుల వల్ల అప్పుడప్పుడు స్థాయినికులకు పలు ఇబ్బందులు ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా కోతి ఓ భవనం టెర్రస్ మీది నుంచి పరిగెత్తుతుండగా జారి పడింది. పై నుంచి నేరుగా పార్క్ చేసిన కారు సన్ రూఫ్ మీద పడిపోయింది. కోతి బరువుకు సన్ రూఫ్ పగిలిపోయింది. కారు నేరుగా కారులోపల పడిపోయింది. వెంటనే కారు పైకి ఎక్కింది. అక్కడి నుంచి లగెత్తింది. ఈ వ్యవహారం అంతా అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. భవనం టెర్రస్ మీది నుంచి పడిపోయినట్లు ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ఘటన విశ్వేశ్వర గంజ్ లో జరిగినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
Unexpected visitor: Monkey falls on car, shattering sunroof in northern India#UttarPradesh #Monkey #Varanasi
Note👈https://t.co/FnUdSqwVan pic.twitter.com/UfDy1r8gFS
— Newslions (@newslions_live) November 20, 2024
కోతులతో స్థానికులకు ఇబ్బందులు
గత కొంత కాలంగా వారణాసిలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. కోతులు చేసే అల్లరి పనులకు ప్రజలు దైనందిన జీవితంలో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా కోతుల బెడదపై స్పందించాలని కోరుతున్నారు. లేదంటే కోతులతో ఇప్పుడు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో అధికారులు కోతుల సమస్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: కోడి ముందా? గుడ్డు ముందా? ఫైనల్ గా ఆన్సర్ దొరికేసింది!