Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాలు రెచ్చిపోతున్నాయి. ఒకదానిపై మరొకటి భీకర దాడులకు పాల్పడుతున్నాయి. రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా నిలవగా, ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా నిలుస్తోంది. ఉక్రెయిన్ కు అమెరికా భారీ ఆయుధాలను అందిస్తుండటంతో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఇటీవల ఉక్రెయిన్ అమెరికన్ క్షిపణులతో రష్యాపై దాడికి పాల్పడింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం అయ్యాయి.
Also read: పోసాని సంచలన ప్రకటన.. రాజకీయాలకు గుడ్ బై.. చచ్చేవరకు ఎవ్వరి గురించి మాట్లాడను
పరిస్థితులు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్దం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అనుమానిస్తున్నారు. తాజాగా రష్యా తొలిసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణితో ఉక్రెయిన్ పై దాడి చేసిందని ఉక్రెయిన్ వాయుసేన ప్రకటించింది. ఉక్రెయిన్ లోని డెనిపర్ నగరంపై దాడి జరిగినట్టు తెలిపింది. కానీ అది ఏ రకం బాలిస్టిక్ క్షిపణి అనేది ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించలేదు. దీనితో పాటూ ఎక్స్-47 ఎం 2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా రష్యా ప్రయోగించినట్టు తెలిపింది. ఉక్రెయిన్ వెల్లడించిన వివరాలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది.
చెప్పేందుకు ఏమీ లేదని, తమ సైనికులను అడగాల్సిన ప్రశ్న అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కనీసం 5500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. భూగర్భంలో ఏర్పాటు చేసిన సిలోస్ నుండి లేదా మొబైల్ వాహనాల నుండి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగిస్తారు. తొలిసారి 1957లో సోవియట్ యూనియన్ ఖండాతరం బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. 1959లో అమెరికా నిర్వహించిన పరీక్షలు సలఫం అయ్యాయి.