Viral Video : ఆ భార్యభర్తల మధ్య గొడవలు. భార్య మీద అతనికి అనుమానం. ఆమెకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని నమ్మకం. అదే విషయంలో పదే పదే ఆ ఇద్దరూ తిట్టుకునే వారు. విషయం ఇంట్లో వాళ్లకు కూడా తెలిసింది. అత్తామామలు కొడుక్కు సపోర్ట్‌గా నిలిచారు. తమ కోడలు మంచిది కాదని అనుకున్నారు. ఆమె మాత్రం తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ సుద్దపూస మాటలు మాట్లాడేది. అయినా, ఇంట్లో వాళ్లకు డౌట్ పోలేదు. ఎలాగైనా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని గట్టిగా నిఘా పెట్టారు. ఆ ప్రియుడు ఎవడో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యారు.
వన్ ఫైన్ డే.. తన భార్య ఓయో రూమ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తోందని తెలుసుకున్నాడు ఆ భర్త. ఇదే ఛాన్స్ అని ఎలాగైనా ఈసారి భార్యను, ఆమె ప్రియుడిని పట్టేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. తనతో పాటు తన పేరెంట్స్‌ను సైతం తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ పోలీసులకు సైతం ఫోన్ చేసి.. భార్య ఎఫైర్ గురించి చెప్పాడు. ఖాకీలను కూడా ఓయో హోటల్‌కు రమ్మని పిలిచాడు.
ఓయో రూమ్‌లో ఉండగా.. భర్త ఎంట్రీ
అంతా కలిసి ఓయో హోటల్‌పై రైడ్ చేశారు. తన భార్య ఉన్న గది తలుపులు బాదాడు. లోపల నుంచి సౌండ్ రాలేదు. పేరు పెట్టి మరీ గట్టిగా పిలిచాడు. వచ్చింది తన భర్తే అని తెలిసి హడలిపోయింది. గదిలో ప్రియుడితో దొరికితే ఇంకేమైనా ఉందా? అని భయపడిపోయింది. ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంది. కానీ, ఎలా? గది డోర్ పెట్టి ఉంది. తీస్తే డోర్ ముందే భర్త వాళ్లు ఉన్నారు. ఇప్పుడెలా? తెగ టెన్షన్ పడింది ఆ భార్య. అంతలోనే ఆ గదికి ఉన్నది ఓపెన్ విండో అని తెలిసి.. మెళ్లిగా కిటికీ నుంచి పక్క బిల్డింగ్ పైకి చేరింది. అక్కడి నుంచి ఇంకో ఇంటిపైకి వచ్చింది. కానీ, ఆ తర్వాత ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అదే లాస్ట్ ఇల్లు. దానిని ఆనుకొని మరో భవనం లేదు. కిందకు చూస్తే అక్కడ చెత్త కుప్పలు, పాత బట్టల మూటలు కనిపించాయి. ఆ గోడ సుమారు 16 అడుగుల ఎత్తు ఉంది. వెనక్కి పోలేదు. పోతే భర్తకు దొరికిపోతుంది. ముందుకు వెళ్లాలంటే అంతెత్తు నుంచి దూకేయడం మినహా వేరే మార్గం లేదు. చేసేది లేక.. గుండెల నిండా భయం ఉన్నా.. ధైర్యం చేసి ఆ ఇంటి పైనుంచి దూకేసింది. ఆ యువతి గోడ మీద నుంచి దూకేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : మహిళా ఉద్యోగి ఇంట్లోకి దొంగచాటుగా దూరిన బాస్..
రూమ్‌లో దొరక్కున్నా.. వీడియోలో దొరికేసింది..
ఇదంతా వీడియో తీసింది ఆ భర్త తరఫు వాళ్లే. ఆమె కిటికీలోంచి బయటకు రాగానే.. వాళ్లు డోర్ పగలగొట్టి లోపలికి వచ్చేశారు. కానీ ఓయో రూమ్‌లో ఆమె లేదు. ప్రియుడిని పట్టేసుకున్నారు. ఆమె వెనక నుంచి పారిపోతోందని గుర్తించారు. భర్త తరఫున వచ్చిన ఓ యువతి బిల్డింగ్‌కు అటువైపు వెళ్లి వెతుకుతుంటే.. ఆ మహిళ గోడ దూకే సీన్ కనిపించింది. వెంటనే మొబైల్‌లో రికార్డ్ చేసింది. అదే ఇది. మామూలుగా లేదు ఆ వీడియో. యూపీ, బాగ్‌పత్‌లోని ఓ ఓయో హోటల్‌లో జరిగిన ఈ ఘటన.. దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद….@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7
— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025