BigTV English

OTT Movie : ఓనర్ ని నమ్మి భార్య పిల్లల్ని వదిలి వెళ్తే… మంజుమల్ బాయ్స్ లాంటి రియల్ స్టోరీ

OTT Movie : ఓనర్ ని నమ్మి భార్య పిల్లల్ని వదిలి వెళ్తే… మంజుమల్ బాయ్స్ లాంటి రియల్ స్టోరీ

OTT Movie : రియల్ స్టోరీలను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా మంజుమల్ బాయ్స్ మూవీ రియల్ స్టోరీతో తెరకెక్కి,  సంచలన విజయం నమోదు చేసింది. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీ చిలి దేశంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. బంగారం గని లోకి వెళ్లిన 33 మంది కార్మికులు ఒక ప్రమాదంలో చిక్కుకుపోతారు. వాళ్లను కాపాడే ప్రయత్నంలో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జియో సినిమా (Jio Cinema) లో

ఈ హాలీవుడ్ సర్వైవల్ మూవీ పేరు ‘ది 33‘ (The 33). ఈ  సర్వైవల్ మూవీకి ప్యాట్రిసియా రిగ్గెన్ దర్శకత్వం వహించారు. ఇందులో మిక్కో అలాన్, క్రెయిగ్ బోర్టెన్, మైఖేల్ థామస్, జోస్ రివెరా రచించారు. చిలీలోని శాన్ జోస్ మైన్‌లో 69 రోజుల పాటు 33 మంది మైనర్లు చిక్కుకుపోయిన 2010 కోపియాపో మైనింగ్ విపత్తు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. ఈ మూవీలో ఆంటోనియో బాండెరాస్ చిక్కుకున్న మైనర్ మారియో సెపుల్వెడాగా నటించారు. ఇది చిలీలో ఆగస్ట్ 6, 2015న 20వ సెంచరీ ఫాక్స్ ద్వారా, యునైటెడ్ స్టేట్స్‌లో నవంబర్ 13, 2015న వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్, ఆల్కాన్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదల చేయబడింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

ఒక బంగారం గనిలోకి 33 మంది కార్మికులు పనిచేయడానికి వెళ్తారు. ఆ ప్రాంతం లో ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఆ కార్మికులు కూడా అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు. వాళ్ళ భయం నిజంగానే ఒకసారి నిజం అవుతుంది. ఒక పెద్ద బండరాయి వీళ్ళు వెళ్లే దారిలో అడ్డుపడుతుంది. వాళ్లు బయటికి వచ్చే అవకాశం లేకుండా పోతుంది. అందులో మూడు రోజులకు మాత్రమే సరిపోయే ఆహారం ఉంటుంది. ఈ విషయం బయటకు తెలిసి, గవర్నమెంట్ వాళ్ళను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది అసాధ్యమే అని అందరూ అనుకుంటారు. దాదాపు 15 రోజులు ఆ బండరాయిని కొట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే అక్కడ ప్రమాదంలో ఇరుక్కున్న వాళ్ళు అందరూ చనిపోయారు అనుకుంటారు.

అక్కడికి వచ్చిన మినిస్టర్ వాళ్లను ఎలాగైనా కాపాడాలనుకుంటాడు. బండరాయి మార్గం ద్వారా కాకుండా, వేరొక మార్గం ద్వారా హోల్ చేయాలని చెప్తాడు. ఆ మార్గం ద్వారా ఒక చిన్న రంధ్రం మాత్రమే పడుతుంది. అందులో ఉన్న వ్యక్తులు బతికే ఉన్నారని తెలుసుకుంటారు. ఒక బాంబు పెట్టి ఆ బండరాయిని పేల్చడం తప్ప వేరే మార్గం లేదని చెప్పడంతో, చేసేదేం లేక చివరికి బాంబు పెడతారు. ఆతరువాత ఆ 33 మంది బతికారా లేదా అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో సినిమా (Jio Cinema) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది 33’ (The 33) అనే ఈ సర్వైవల్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×