Teenager Vandalise Bus| నగరంలోని బిజీ రోడ్డు. వాహనాల రాకపోకలతో కిటకిట లాడుతోంది. ఇంతలో ఒక కుర్రాడు రోడ్డు మీద ఆగిఉన్న బస్సువైపునకు వెళ్లాడు. అక్కడ ఓ పెద్ద కత్తి తీసుకొని బస్సు అద్దాలను బలంగా కొట్టి ధ్వంసం చేశాడు. ఆ తరువాత అడ్డుగా వచ్చిన బస్సు డ్రైవర్ ని కత్తితో పొడిచేస్తానని బెదిరించాడు. ఈ దృశ్యాలన్నీ సమీపంగా నిలబడి ఉన్న ఒక వ్యక్తి వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అందరూ ఆ కుర్రాడు ఎందుకు అలా చేశాడని ప్రశ్నిస్తున్నారు?
వివరాల్లోకి వెళితే.. వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చెందినవి. శనివారం ఏప్రిల్ 19, 2025 మధ్యాహ్నం 3.10 గంటలకు ముంబై లోని భాండప్ ప్రాంతంలో బిజీ ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై బ్రిహన్ ముంబై ఎలెక్ట్రిక్ అండ్ ట్రాన్స్ పోర్ట్ (BEST) బస్ వెళుతుండగా.. ఒక 16 ఏళ్ల టీనేజ్ కుర్రాడు చేతిలో పెద్ద కత్తి (రాజుల కత్తి) తీసుకొని సడెన్ గా వచ్చి బస్సుని ఆపాడు. డ్రైవర్ వద్దకు వెళ్లి కత్తితో దాడి చేయబోయాడు. డ్రైవర్ ను అసభ్య పదజాలంతో తిట్టాడు. దీంతో ఆ డ్రైవర్ ప్రాణభయంతో బస్సు నుంచి దూరంగా వెళ్లాడు. ఆ తరువాత ఆ కుర్రాడు బస్సు ముందుభాగంలో, కీటికీ అద్దాలను తన వద్ద ఉన్న కత్తితో పగులగొట్టాడు.
Also Read: శవం ముందు ప్రియురాలితో పెళ్లి.. తమిళనాడులో వింత వివాహం
బస్సుపై ఆ కుర్రాడు దాడి చేసి ధ్వంసం చేయగా.. రూ.70,000 మేర నష్టం కలిగిందని సమాచారం. అయితే ఆ కుర్రాడు అంతటితో ఆగలేదు. సమీపంలో నిలబడి ఉన్న ఒక వాటర్ ట్యాంకర్, ఒక ఆటో రిక్షా అద్దాలు కూడా ధ్వంసం చేశాడు.
రిమాండ్ హోమ్ కు తరలింపు
ఇదంతా జరుగుతుండగా.. ఆ బస్సు డ్రైవర్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతని గురించి విచారణ చేయగా.. ఇంట్లో అతు దొంగతనం చేశాడని అతని మామ మందలించినట్లు తేలింది. ఈ కారణం చేత కోపిష్టి అయిన ఆ కుర్రాడు తన ఎదురుగా ఉన్న వస్తువులపై తన కోపాన్ని చూపాడు.
బస్ డ్రైవర్ గ్యానేశ్వర్ రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్రాడిపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజీ చట్టం కింద కేసు మోదు చేసి ప్రస్తుతం అతడిని జువెనైల్ రిమాండ్ హోమ్ కు తరలించి విచారణ చేస్తున్నారు. అతని చేతిలో కత్తి లాంటి మారణాయుధాలు ఉండడంతో ఆయుధాల చట్టం కింద కూడా చర్యలు చేపడతామన్నారు. ఆ కుర్రాడిపై ఇంతకుముందు కూడా కొన్ని కేసులు ఉన్నట్లు మీడియాకు తెలిపారు.