BigTV English

Viral Video: స్కూటీ నడిపిన ఎద్దు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Viral Video: స్కూటీ నడిపిన ఎద్దు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Funny Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాక్ కి గురి చేస్తే, మరికొన్ని ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.  ఇందులో ఓ ఎద్దు ఏకంగా స్కూటీని నడుపుతూ కనిపించడంతో అందరూ షాకయ్యారు. ఎద్దు.. స్కూటీని నడపడం ఏంటని మీరూ ఆశ్చర్యపోతున్నారా? అయితే, ముందుగా వీడియోను చూసేయండి..


రిషికేష్ లో స్కూటీని నడిపిన ఎద్దు

తాజాగా ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో ఈ వింత ఘటన జరిగింది. ఎద్దు స్కూటీ మీద కూర్చొని పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి అందరూ ఇదేం వింత రా బాబూ అనుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సోషల్ మీడియాలో రికార్డు అయ్యాయి.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఓ వ్యక్తి తన ఇంటి ముందు హోండా యాక్టివా బైక్ ను ఆపాడు. ఇంట్లోకి వెళ్లిపోయాడు. అదే వీధిలో అటుగా వచ్చిన ఓ ఎద్దు బుర్రలో ఏ పురుగు తిరిగిందో తెలియదు కానీ, ఒకేసారి రెండు కాళ్లు పైకెత్తి స్కూటీ మీద కూర్చుంది.  ఇంతలో స్కూటీ స్టాండ్ పైకి వెళ్లింది. స్కూటీ ముందుకు కదలడం మొదలు పెట్టింది. అలా కొంత దూరం వరకు ఎద్దు స్కూటీ మీదే కూర్చొని వెళ్లింది. ఆ తర్వాత ఓ ఇంటి పక్కన ఉన్న ముళ్ల కంపలో పడిపోయింది. ఎద్దు కాసేపు అక్కడే నిలబడి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. స్కూటీ యజమాని వచ్చి చూసే సరికి స్కూటీ కనిపించలేదు. ఇంటి ముందు పార్క్ చేసిన బండి ఎక్కడపోయింది అని ఆరా తీశాడు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీ చూసి షాకయ్యాడు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నిజానికి ఆ ఎద్దు కొమ్ములు స్కూటీలో ఇరుక్కు పోవడం వల్లే అలా జరిగి ఉండొచ్చని స్థానికులు చెప్తున్నారు.

ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న నెటిజన్లు

ఇక ఈ వీడియోను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేస్తూ, అదిరిపోయే కామెంట్స్ పెడుతున్నారు.  “అక్కడ సీసీటీవీ లేకపోతే, నిజంగా ఎవరో తన స్కూటీనీ దొంగతనం చేశారని యజమాని భావించేవాడు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొంత మంది “ఎద్దు స్కూటీని దొంగిలించింది” అని ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. నెటిజన్లకు ఈ వీడియోను చూసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి పశువులు వాహనాల మీదికి ఎక్కడం అనేది ఉండదు. ఒకవేళ ఏదైనా చిరాకులో ఉంటే ఎదరుగా వచ్చిన బైకులను, పార్క్ చేసిన వాహనాలను కొమ్ములతో కుమ్మేస్తూ ముందుకెళ్తాయి. ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్డు మీద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: కర్రలతో కొట్టుకున్న బామ్మలు.. భవిష్యత్తులో ఇలాంటివి చూడలేం ఏమో!?

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×