Funny Video: నీటి కుళ్లాయిల దగ్గర ఒకప్పుడు ఆడాళ్ల సందడి మామూలుగా ఉండేది కాదు. నేను ఫస్ట్ అంటే.. నేను ఫస్ట్ అంటూ బిందెలతో కొట్లాడుకునే వాళ్లు. నళ్లా దగ్గర నీళ్లు వచ్చాయంటే చాలా పంచాయితీ షురూ కావాల్సిందే. ఇక పక్కపక్కన వాకిలి ఉన్నవాళ్లు నువ్వు ఊడ్చాలి అంటే, నువ్వు ఊడ్చాలంటూ తెల్లవారుతుండగానే కొట్లాటలు మొదలయ్యేవి. తాజాగా బామ్మలు కొట్లాడుకునే ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో మీరూ చూసేయండి.
కర్రలతో కొట్లాడుకున్న బామ్మలు
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు బామ్మల మధ్య గొడవ అవుతుంది. కారణాలు ఏంటో తెలియదు గానీ, ఒకరిపై మరొకరు కారాలు, మిర్యాలు నూరుకుంటారు. ఏకంగా కొట్లాటకు దిగాలి అనుకుంటారు. అందులో ఓ బామ్మ చిన్న కర్ర చేతిలో పట్టుకుని మరో బామ్మను కొడతానని హెచ్చరిస్తుంది. ఆ బామ్మ ఇంట్లో ఉండి మరో బామ్మకు వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో మరో బామ్మకు తన మనువరాలు పెద్ద కర్ర చేతికి అందిస్తుంది. ఇక వెంటనే ఆ బామ్మ మరో బామ్మ మీదికి ఫైటింగ్ కు రెడీ అవుతుంది. నిన్ను కొడతా అంటే, నిన్ను కొడతా అంటూ ఇద్దరూ కొట్లాటకు దిగుతారు. ఒకరినొకరు కర్రలతో కొట్టుకునేందుకు ప్రయత్నించినా, ఎవరి మీద కర్ర దెబ్బ మాత్రం పడదు. సుమారు నిమిషం పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లకు ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Also: ట్రంప్ కు కిమ్ మామ హెయిర్ కట్.. తన లుక్ చూసుకుని ఒకటే ఏడుపు!
బామ్మల కొట్లాటను చూసి నెటిజన్లు ఏం అంటున్నారంటే?
‘ఇద్దరు బామ్మల మధ్య Cold War(C is Cilent) అద్భుతంగా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. “ఈ ఫైటింగ్ కు మాస్టర్ మైండ్ కిడ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. “అటాక్ 100%. డ్యామేజ్ 0%” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “గేమ్ ఆఫ్ గ్రాండ్ మాస్” అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “పాత రోజుల్లో ఇలాంటి ఘటనలు నిత్యం కనిపించేవి. ఇప్పుడు చాలా వరకు మాయం అయ్యాయి. భవిష్యత్ లో ఇలాంటి పంచాయితీలను ఇక చూడలేమేమో?” అంటూ మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. “అంతరించిపోతున్న కళల్లో ఇది ఒకటి. రాబోయే తరాలకు ఇలాంటివి ఇక కనిపించకపోవచ్చు” అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
Read Also: ట్రంప్ కు కిమ్ మామ హెయిర్ కట్.. తన లుక్ చూసుకుని ఒకటే ఏడుపు!