BigTV English
Advertisement

Poonam Kaur: సీఎం రేవంత్ రెడ్డినే ప్రశ్నించిన పూనమ్.. ఆ విషయం ఎందుకు అడగలేదు

Poonam Kaur: సీఎం రేవంత్ రెడ్డినే ప్రశ్నించిన పూనమ్.. ఆ విషయం ఎందుకు అడగలేదు

Poonam Kaur: ఒకప్పుడు వివాదం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు నటి పూనమ్ కౌర్ గురించి చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయం  అయినా కూడా పూనమ్ అస్సలు వదిలిపెట్టదు. అయితే ఫేమస్ అవ్వాలనుకొని చేస్తుందో.. లేక తాను కూడా ఇండస్ట్రీలో ఉన్నానని గుర్తుచేస్తుందో తెలియదు కానీ, ఒక్క పోస్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేయడం మాత్రం  అలవాటుగా పెట్టుకుంది.


ముఖ్యంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, లైంగిక వేధింపులు ఈ మాటలు వినిపించాయి అంటే.. పూనమ్ ను ఆపడం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పొచ్చు. అయితే ఈసారి ఈ మూడు కాకుండా ఈసారి బన్నీ కేసు గురించి మాట్లాడింది. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ కేసు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం  తెల్సిందే. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలోరేవంతి అనే మహిళ మృతి చెందడం ..  బన్నీ మెడకు చుట్టుకుంది. బన్నీ వెళ్లడం వలనే మహిళ మృతి చెందింది అని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది.

Venkatesh: తొలిసారి ఫ్యామిలీపై స్పందించిన వెంకటేష్.. భార్యపై ఊహించని కామెంట్..!


ఇక ఇలాంటి  ఘటనలు జరగకుండా సీఎం రేవంత్ రెడ్డి  ఇకనుంచి బెన్ ఫిట్ షోలను క్యాన్సిల్ చేయరాని తెలిపారు. ఇక దీంతో  ఇండస్ట్రీ పెద్దలు మొత్తం కలిసి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. FDC చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ కు చెందిన సుమారు 56 మంది ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ చర్చల్లో హీరోలు వెంకటేష్, నాగార్జున, శివ బాలాజీ, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ.. నిర్మాతలు నాగ వంశీ, కేఎల్ నారాయణ, నవీన్, రవిశంకర్, దానయ్య పలువురు హాజరయ్యారు.

ఇక దర్శకుల్లో రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వీర శంకర్ తదితరులు హాజరయ్యారు. ఇంతమందిలో ఒక్కరు కూడా మహిళలు లేరు. దీంతో ఇండస్ట్రీలో మహిళలకు ప్రాముఖ్యత లేదా.. ? వారికి సమస్యలు ఉండవా.. ? అని నటి పూనమ్ ప్రశ్నించింది. డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డినే ఆమె ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టింది. ” రేవతి మృతి విషయంలో కానీ, సామాన్య ప్రజల విషయంలో కానీ సీఎం రేవంత్ రెడ్డిగారు ఎంతో బాధపడుతున్నారు. కానీ, భేటీలో ఒక్కరైనా మహిళ లేదని ఎందుకు అడగలేకపోయారు” అని పోస్ట్ పెట్టింది.

Bigg boss: విష్ణుప్రియకు అది తప్పా మరేం దక్కలేదా..?

ఇక ఇంకో పోస్ట్ లో “సీఎంతో సమావేశానికి తీసుకెళ్లేంత ముఖ్యమైన మహిళలుగా ఎవరూ పరిగణించలేదు. మహిళలకు ఎటువంటి సమస్యలు ఉండవు..వ్యాపార లేదా ఇతర విషయాల్లో హీరోలకు సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా సపోర్ట్ గా నిలబడుతుంది. మహిళలకు సమస్యలు లేవు.. ఎవరు వారి పక్కన నిలబడరు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.  ఈ విషయంలో చాలామంది పూనమ్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ముగుస్తుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×