Intinti Ramayanam Today Episode February 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి చీర గురించి పల్లవి అని అడుగుతుంది. పల్లవి నీళ్లు నమ్ముతుంది. అందరూ గట్టిగా అడిగే లోపల దాని దగ్గర ఉన్న చీరలు తీసుకొచ్చి కోమలితో ఇలాంటి శారీ నీకు కూడా ఉంది కదా అనేసి అంటుంది.. ఇక ఇలాంటి చీర అవని దగ్గర కూడా ఉంది కదా అనేసి అడుగుతుంది. అసలు అవని నా నువ్వా నా తోసి చంపాలనుకునిందని అందరూ నిలదీస్తారు. పల్లవి మొత్తానికి సేఫ్ అయినట్లే అవుతుంది.. ఇక అవని బట్టలు ఆరెస్తూ ఉండగా పంచాయతీ కోసం ఎవరు వస్తారు.. అత్త భార్య మధ్య నలిగిపోతున్న ఓ వ్యక్తి పంచాయతీకి వస్తాడు మొత్తానికి స్వరాజ్యం అతనికి బుద్ధి చెప్పి భార్య పిల్లలతో సంతోషంగా ఉండమని పంపిస్తుంది.. ఇక అవని వాళ్ళ పరిస్థితి తన పరిస్థితి లాగే ఉందని బాధపడుతుంది. ఇక పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ కి ఫోన్ చేస్తుంది. నేను అవని ఇంట్లో పంపించడానికి ఒక ప్లాన్ చేశానని చెప్పాను కదా ఆ శారీ ఈరోజు అత్తయ్యకి దొరికింది తృటిలో తప్పించుకున్నాను.. ఆ విషయం చెప్పగానే చక్రధర్ కోపంతో రగిలిపోతాడు. బుద్ధుండాలి అదేమన్నా గొప్ప పని చేశావా నువ్వు దాచి పెట్టుకోవడానికి ఏదైనా చేసిన తర్వాత మన చేతికి మట్టి అంటే కోకుండా ఉండాలని లేదా దాని నామరూపాలు కూడా లేకుండా చేయాలని చక్రధర అంటాడు. డాక్యుమెంట్స్ కాల్చమని చెప్పాను కాల్ చేసావా అలాగే ఆ చీరను కూడా కాల్చి బూడిద చేసే అని చక్రధర్ పల్లవి తో అంటాడు. ఆరాధ్యకు జ్వరం రావడంతో ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్యకు జ్వరం వచ్చింది వదిన అమ్మ అమ్మని నిన్నే కలవరిస్తుంది.. నువ్వు ఒక్కసారి వచ్చిపో వదిన అంటే నేను ఆ ఇంటికి వస్తే ఎంత గొడవలు జరుగుతాయో నాకు తెలుసు కన్నయ్య నేను ఇప్పుడు వస్తే ఏం జరుగుతుందో అత్తయ్య ఎలా గొడవ చేస్తుందో నీకు అర్థం కావట్లేదు అనేసి అంటుంది. ఇక కమల్ డాక్టర్ కోసం వెయిట్ చేస్తాడు నర్స్ వేషంలో అవని ఆ ఇంటికి వస్తుంది. డాక్టరు ఏమీ లేదు మామూలు జ్వరమైనా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. వాళ్ళ అమ్మని పాప కలవరిస్తుంది మరి వాళ్ళ అమ్మ ఇక్కడ లేదండి అని అడుగుతారు డాక్టర్. కానీ లేదండి వేరే పని మీద బయటకెళ్ళిందని వాళ్ళు చెప్తారు. పాపకు వచ్చింది చిన్న జ్వరమే అయితే మా నర్సు మీకు రాత్రంతా చూసి చెబుతుంది అని అనగానే నర్సిం ఎందుకండీ మేము చూసుకుంటాం అనేసి పార్వతి అంటుంది. తనకి టైం కి మెడిసిన్స్ ఇవ్వడం ఫీవర్ ని చెక్ చేయడం మా నర్సు చూసుకుంటుంది లేండి అనేసి డాక్టర్ అంటుంది. ఇక డాక్టర్ వెళ్ళిపోతుంది నర్సు మీరందరూ బయటకు వెళ్ళండి నేను చూసుకుంటాను అనేసి అంటుంది.
ఇక అవని తన మాసం తీసేసి ఆరాధ్యను దగ్గరకు తీసుకుంటుంది. దానితో ఆరాధ్య అమ్మను పట్టుకొని ఏడుస్తుంది నువ్వు వెళ్ళిపోతావ్ అమ్మ నువ్వు ఉండకపోతే నేను ఉండలేను అమ్మ నేను చూడాలనిపిస్తుంది అనేసి ఏడుస్తుంది. నువ్వు మంచి మంచిగా ఉండి నాన్న చెప్పిన మాట విని స్కూలుకు వెళ్తే నేను మళ్ళీ వస్తాను నేను సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా అమ్మ అనేసి అవని అంటుంది. ఇక పార్వతి వస్తుంది పాప ఏదైనా తిందామని అడిగితే ఏమి తినలేదండి అనేసి అంటుంది అయితే పాలు తీసుకొస్తానని పార్వతి వెళుతుంది. పాలు తీసుకొచ్చి ఇస్తుంది పార్వతి. ఇక అవని రాత్రంతా ఆరాధ్యను చూసుకుంటుంది. మధ్యలో అక్షయ వస్తాడు.
బావ వాళ్ళ అమ్మ కోసం కలర్ ఇస్తుంది వాళ్ళ అమ్మగారు లేరా ఎక్కడికైనా వెళ్లారా అంటే వేరే పనిమీద బయటికి వెళ్లారండి ఇంట్లో వాళ్లకైతే చెప్పుకోవచ్చు బయట వాళ్లకి అన్ని విషయాల గురించి చెప్పలేం అనేసి అక్షయ్ అంటాడు. ఇక ఉదయం లేవగానే ఆరాధ్యను తీసుకుని నర్సు బయటికి వస్తుంది. ఆరాధ్యను చూసి ఇంట్లో వాళ్ళందరూ సంతోష్ పడతారు.. మనవరాలికి త్వరగా నయం అయ్యేలా చేశారు నర్సులాగా కాకుండా అమ్మలాగా చూసుకున్నారు మీకు చాలా థాంక్స్ అండి అనేసి పార్వతి డబ్బులు తీసుకురమ్మని చెప్తుంది. నర్సుగా వచ్చిన అవని డబ్బులు ఏమొద్దండి మీరు అన్నారు కదా అమ్మ లాగా చూసుకున్నానని అది చాలు నాకు అనేసి అంటుంది. ఇక ఆరాధ్య నువ్వు జాగ్రత్త మానేసి వెళ్ళిపోతున్న అవనీని పల్లవి పిలుస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…