Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా అంటే ఓ వ్యసనంలా మారిపోయింది. ఏ చిన్న ఘటన జరిగినా కూడా వీడియోలు తీయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది ఓ పనిగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రాణాలను పోయే పరిస్థితులు ఎదురైనా కూడా ప్రజలు వెనుకాడడం లేదు. తాజాగా అలాంటిదే ఓ ఆశ్చర్యకర ఘటన చైనా దేశంలో వెలుగుచూసింది. ఓవైపు వరద నీరు ముంచుకొస్తుంటే ప్రాణాలను రక్షించుకోవాల్సింది పోయి ఆ ఘటనను వీడియోలు తీస్తూ ఉండిపోయారు కొంతమంది. ఈ తరుణంలో అదే వరద నీటిలో దారుణంగా కొట్టుకుపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా దేశాన్ని భారీ వర్షాలతో పాటు వరదలు కూడా ముంచెత్తాయి. దీంతో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే ఓవైపు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ప్రజల్లో మాత్రం ఎటువంటి భయాందోళన కలగడం లేదని ఓ ఘటన కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుంది. భారీ వర్షాల కారణంగా జన జీవనం స్థబించిపోయి బిక్కుబిక్కు మంటూ బ్రతుకున్నారు. అయినా కూడా ప్రాణాలను లెక్కచేయకుండా కొంత మంది ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సోషల్ మీడియాలో వీడియోలు చేయడం వరకు బాగానే ఉంది. కానీ ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురవుతున్నా కూడా లెక్కచేయకుండా వీడియోలు చేయాలి, ఫేమస్ అవ్వాలని అనే ఆలోచన మాత్రం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తుంది. చైనాలో భారీ వర్షాల కారణంగా కియాంటాంగ్ అనే నది పొంగిపొర్లుతుంది. ఈ తరుణంలో ప్రజలందరూ ఆ నది ప్రవాహాన్ని చూసేందుకు బారులు తీరారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా కూడా.. వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో ఒక్కసారిగా వరద నీరు భారీగా ప్రవహిస్తూ వారిపైకి వస్తుంది. అయినా కూడా పట్టించుకోకుండా కొంత మంది వీడియోలు తీసే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో కొంత మంది భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తే, మరికొంత మంది మాత్రం వీడియోలు తీస్తూ అక్కడే ఉండిపోయారు. ఇక విచిత్రం ఏంటంటే ఓ యువతి మాత్రం వరద నీరు మీదకు వచ్చిన సంగతినే లెక్క చేయకుండా వీడియోను తీస్తూనే ఉండిపోయింది.
ఈ క్రమంలో ఆ వరద నీటితో వీడియోలు తీస్తూ అక్కడ ఉన్న వారంతా కొట్టుకుపోయారు. అంతేకాదు ఆ వరద నీరు చాలా మురికిగా కూడా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. వీడియోలు చూసిన నెటిజన్లు అక్కడి ప్రజలపై మండిపడుతున్నారు. ‘ప్రాణాలు పోతున్నా కూడా వీడియోలు తీయడం అవసరమా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
People trying to record the Qiantang River in China on video were swept away by floodwaters. pic.twitter.com/JkmU35uEQX
— Europe Invasion (@EuropeInvasionn) September 8, 2024