Cardiac Arrest: గుండెపోటు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండె సంబంధిత వ్యాధులు వృద్ధులను మాత్రమే కాకుండా యువతను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో అత్యంత సాధారణమైనది లైఫ్ స్టైల్.
వ్యాయామం లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మొదలైన కారణంగా.. చిన్న వయస్సులోనే గుండెపోటుతో చాలా మంది మరణిస్తున్నారు. ఈ రోజుల్లో డ్యాన్స్ చేస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఇలానే కాకుండా నిద్రలో కూడా హృదయ స్పందన ఆగిపోవచ్చు. ఒక్కోసారి ఇది మరణానికి కూడా దారితీస్తుంది. దీనిని కార్డియాక్ అరెస్ట్ అని అంటాు.
కార్డియాక్ అరెస్ట్ కారణాలు, లక్షణాలు:
ధమనులలో అడ్డంకులు:
గుండె జబ్బులకు అనారోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం వంటి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘకాలిక గుండె జబ్బుల కారణంగా, నిద్ర పోతున్నప్పుడు వ్యక్తి హృదయ స్పందన ఆగిపోవచ్చు. ఎక్కువ ఆందోళన, ఒత్తిడి కారణంగా కూడా ధమనులలో అడ్డంకులు ఏర్పడతాయి. అందుకే ఆరోగ్యం పట్ల కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తీవ్ర మైన పరిస్థితిని నివారించడానికి.. చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలి. దీనితో పాటు.. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.
నిద్రలో గుండెపోటు లక్షణాలు:
మన శరీరంలో ఏదైనా సమస్య ఉంటే ముందుగానే కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ లక్షణాలను సరైన సమయంలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. నిద్రపోతున్నప్పుడు హృదయ స్పందన ఆగి పోకముందే శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఛాతీలో భారము లేదా నొప్పి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
శ్వాస ఆడకపోవడం
భయం
తలతిరగడం లేదా మూర్ఛపోవడం
వేగవంతమైన హృదయ స్పందన
పాదాలు లేదా అరికాళ్ళలో వాపు
అధిక చెమట
రాత్రిపూట నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొనడం కూడా ఆకస్మిక గుండె ఆగిపోవడం లేదా గుండె వైఫల్యానికి ప్రధాన లక్షణం. ఇది వైద్య పరమైన అత్య వసర పరిస్థితి. సకాలంలో చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి చనిపోవచ్చు. ఇలాంటి సమయంలో దీని లక్షణాలను అస్సలు పట్టించుకోకుండా ఉండకూడదు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
ఇలా మిమ్మల్ని మీరు రక్షించుకోండి :
ఒక వ్యక్తి సరైన సమయంలో తన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉంటే.. అటువంటి తీవ్రమైన సమస్యలను నివారించడం సాధ్యమవుతుంది. లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అలాగే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం ద్వారా ఆకస్మిక గుండె పోటును నివారించవచ్చు. దీంతో పాటు.. మీరు కొన్ని ఇతర విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Also Read: గ్లోయింగ్ స్కిన్ కోసం.. తప్పకుండా తీసుకోవాల్సిన విటమిన్లు !
రోజూ వ్యాయామం చేయండి.
రక్తపోటును టెస్ట్ చేసుకోండి.
ఎక్కువ ఒత్తిడిని నివారించండి
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి
మీకు ఇప్పటికే డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా డిస్లిపిడెమియా ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.