BigTV English

Madhya Pradesh: వృద్దుడ్ని ఈడ్చుకెళ్లి.. చెంప ఛెళ్లుమనిపించిన డాక్టర్

Madhya Pradesh: వృద్దుడ్ని ఈడ్చుకెళ్లి.. చెంప ఛెళ్లుమనిపించిన డాక్టర్

Madhya Pradesh: వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు దేవుళ్లతో సమానమని భావిస్తారు. డాక్టర్లు సైతం తాము చేసే ఆపరేషన్ సక్సెస్ కావాలని దేవుడ్ని తలచుకుని ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తారు. అలాంటి ఓ డాక్టర్ ఓ వృద్ధుడ్ని ఈచ్చుకుంటూ ఆసుపత్రి నుంచి బయటకు గెంటేశారు. సంచలనం రేపిన ఈ ఘటనలో మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?


అసలేం జరిగింది?

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అక్కడికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. భార్యకు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన 77 ఏళ్ల వృద్ధుడిపై డాక్టర్‌ దురుసుగా ప్రవర్తించాడు.


పెద్దాయన చేయి పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చెంప ఛెళ్లు మనిపించాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడది వైరల్ అయ్యింది. దీనిపై ఉన్నతాధికారులు సంబంధిత డాక్టర్‌పై చర్యలకు ఆదేశించారు.

అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే, పేషెంట్లు అధికంగా రావడంతో డాక్టర్ రాజేష్‌ మిశ్రాకు కోపం తన్నుకుంటూ వచ్చింది. ఓ వైపు రిపోర్టులు సరైన సమయానికి రాలేదు. ఇంకోవైపు పేషెంట్ల నుంచి తాకిడి పెరిగింది. ఇదే క్రమంలో ఏప్రిల్‌ 17న ఉధవ్‌లాల్ జోషి తన భార్యకు ట్రీట్‌మెంట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. క్యూ పెద్దదిగా ఉండటంతో పక్కన నిలబడ్డాడు.

ALSO READ: ALSO READ: నడిరోడ్డుపై బస్సుని ధ్వంసం చేసిన టీనేజ్

రిక్వెస్టు చేయడమే పాపమా?

తన భార్యకు త్వరగా చికిత్స చేయాలని డాక్టర్ జోషిని వేడుకున్నాడు. కాసింత ఆగ్రహానికి గురైన జోషి, పట్టరాని కోపం పెద్దాయనను నేలపై ఈడ్చుకుంటూ ఆసుపత్రి బయటకు తీసుకెళ్లారు. మధ్య వరండాలో పెద్దాయన చెంపపై కొట్టారు. ఈ వ్యవహరమంతా వీడియోలో రికార్టు అయ్యింది. తన విధులకు ఆటంకం కలిగించినందుకు అలా చేయాల్సివచ్చిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

తనపై అకారణంగా డాక్టర్ దాడి చేసినట్టు ఆ వృద్ధుడు వాపోయాడు. చివరకు డాక్టర్ సైతం అక్కడి నుంచి ఎస్కేప్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు హాస్పిటల్‌ అధికారి డాక్టర్‌ అహిర్వార్ ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. డాక్టర్‌ రాజేష్‌ మిశ్రా ప్రవర్తన సహించరాదని, ఆయనపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ డాక్టర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 

Related News

Viral Video: చెంప మీద కొట్టి.. డబ్బులు లాక్కొని.. అమ్మాయితో టీసీ అనుచిత ప్రవర్తన, ట్విస్ట్ ఏమిటంటే?

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Big Stories

×