Wanted Husband Shocking List| ఒకప్పుడు తల్లిదండ్రులు ఇష్టమే తమ ఇష్టంగా చెప్పే పిల్లలు ఇప్పుడు అలా ఉండడం లేదు. ఎక్కువ శాతం బహిరంగంగానే తల్లిదండ్రుల ఎంపికలను విమర్శిస్తున్నారు. పైగా తమక కావాల్సినవి ఇవి అని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ఇది కేవలం అబ్బాయిల వరకే పరిమితం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇటీవలి కాలంలో అమ్మాయిలే డిమాండ్లు కూడా శృతి మించేస్తున్నాయి.
తమ కంటే ఆర్థికంగా ఎక్కవ స్థాయి గల కుటుంబంలో యువతిని పెళ్లి చేసుకోవాలని, ఆమె అందంగా ఉండాలని, కట్నం బాగా తీసుకురావాలని మొదలగు కోరికలు ఉండే యువకులు మన సమాజంలో చూస్తూ ఉంటాం. కానీ గత కొనేళ్లుగా ఇదే తరహా కోరికలు యువతుల్లో కూడా కనిపిస్తున్నాయి. బాగా ధనవంతుడైన యువకుడే తమకు భర్తగా రావాలని, మంచి అందగాడు కావాలని డిమాండ్లు చేస్తున్నారు ఈ కాలం యువతులు. తాజాగా ఓ యువతి తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి ఒక జాబితా రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ జాబితా చదివిన వారంతా షాకై పోతున్నారు.
Also Read: పెళ్లిలో మోసం.. వధువుగా పెళికూతురు తల్లి.. వరుడికి బెదిరింపులు
ఆ యువతి కోరికల జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నెటిజెన్లు తీవ్రగా రియాక్ట్ అవుతున్నారు. ఆమె జీవితం నుంచి మరీ ఎక్కువగా కోరుకుంటోందని ఒక యూజర్ కామెంట్ చేస్తే.. ఆమెకు 60 ఏళ్ల దాటిన వ్యక్తి సంపద కావాలి కానీ అతడు యవ్వనంగా ఉండాలి అని కోరుకుంటోంది. అన్ని తన సుఖాలే కోరుకుంటోంది అని మరొకరు రాశారు. ఇంకొకరైతే అందుకే ఇటీవలి కాలంలో భార్యల వేధింపులకు భర్తలు చనిపోతున్నారంటూ చమతర్కించాడు.