AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయా? సిట్ విచారణలో రాజ్ కసిరెడ్డి ఏం చెప్పాడు? ఈ వ్యవహారమంతా విజయసాయిరెడ్డిపై నెట్టేశారా? ఆయన ఇచ్చిన సమాచారంతో మరికొందరికి నోటీసులు పంపాలని భావిస్తున్నారా? విజయసాయిరెడ్డికి సిట్ నుంచి మళ్లీ పిలుపు వస్తుందా? ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మాజీల్లో టెన్షన్
జగన్ ప్రభుత్వంలో మద్యంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది కూటమి ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. గడిచిన ఆరు నెలలుగా విచారణ చేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. లిక్కర్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి వైసీపీ నేతలు, కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుదేమోనని బెంబేలెత్తుతున్నారు.
మద్యం కుంభకోణం వ్యవహారంలో అప్పటి సీఎంవోలో కీలకంగా వ్యవహరించారు కొందరు రిటైర్డ్ అధికారులు. వారిలో ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పీఏలు ఉన్నారు. ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. లిక్కర్ కేసు వెనుక కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బయటపెట్టారు. కొద్దిరోజుల తర్వాత కసిరెడ్డికి నాలుగు సార్లు సిట్ నోటీసులు ఇచ్చింది.
హైదరాబాద్‌లో చిక్కిన కసిరెడ్డి
విచారణకు ఎందుకు రావాలో వివరాలు చెప్పాలని మెయిల్ ద్వారా సిట్ అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం ఓవైపు జరుగుతుండగానే న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు. చివరకు సోమవారం సాయంత్రం సిట్ అధికారులు ఆయన్ని ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ తరలించారు. మంగళవారం ఉదయం నుంచి కసిరెడ్డిని విచారిస్తున్నారు సిట్ అధికారులు.
ALSO READ: ఏపీలో సీనియర్లకు మొండి చేయి.. అన్నామలైకు ఛాన్స్, వెనుక ఏం జరిగింది?
లిక్కర్ స్కామ్‌లో కీలకమైనవి. బేవరేజ్‌ను మార్చడం ఒక ఎత్తయితే, సప్లై-ఆర్డర్స్ కంప్యూటరైజ్డ్ చేయకుండా మాన్యువల్‌కు మార్చారు. ఇక్కడే లిక్కర్ స్కామ్‌కు బీజం పడిందని అంటున్నారు. మొత్తం ఏడు కంపెనీలకు ఇచ్చారు. వాటిలో ఆదాన్, ఎస్ఎన్జే, లీలా, ఎన్వీ, బీ9, సోలా, మునాక్ ఉన్నాయి. ఆ కంపెనీల నుంచి వచ్చిన నిధులను మరో కంపెనీలకు తరలించారు. అక్కడ పెట్టుబడులు పెట్టారు. వాటిలో ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన విభాగాలు ఉన్నాయి.
వారం కిందట సోదాలు
వారం కిందట సిట్ అధికారులు హైదరాబాద్‌లో ఆయా విభాగాలపై సోదాలు చేశారు. దీంతో హడలిపోయిన బినామీ వ్యక్తులు పైకంపెనీల ఖాతాలకు దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు వేసినట్టు సమాచారం. అకౌంట్లు సీజ్ చేసినా నిధులు ఎలా వస్తున్నాయి ఏంటని షాకయ్యారట అధికారులు. విచారణ నుంచి తప్పించుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఈ వ్యవహారం చాలామంది మెడకు చుట్టుకునే పరిస్థితి నెలకొంది. ఆదాన్ తోపాటు మరో ఆరు కంపెనీలకు 16 వేల కోట్లు సంబంధించి ఆర్డర్లు ఇచ్చి, వారి నుంచి సప్లై తీసుకుంది అప్పటి ప్రభుత్వం. మొన్నటివరకు ఆదాన్ కంపెనీ వీఎస్ఆర్ అందరూ భావించారు. అది తనద కాదని, 100 కోట్లు ఇప్పించానని ఆయన చెప్పారు. దీంతో అదానీ వ్యవహారం గుట్టు బయటకు రానుంది.
సాయిరెడ్డి ట్వీట్ వెనుక
మరోవైపు మంగళవారం ఉదయం లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రియాక్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి. ‘‘ఈ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో మిగతావారి గుండెల్లో టెన్షన్ మొదలైంది.
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025