BigTV English

Tirumala IRCTC: ఇలా చేస్తే ఈజీగా తిరుమల దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ, ఈ రోజే ట్రై చెయ్యండి!

Tirumala IRCTC: ఇలా చేస్తే ఈజీగా తిరుమల దర్శనం.. IRCTC అదిరిపోయే ప్యాకేజీ, ఈ రోజే ట్రై చెయ్యండి!

BIG TV LIVE Originals: చాలా మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తారు. గంటల తరబడి ప్రయాణం చేసి తిరుమలకు చేరుకునే భక్తులు, స్వామి వారిని కేవలం రెండు, మూడు సెకెన్ల పాటు చూసి తరిస్తారు. శ్రీవారి కళ్లారా చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. ఇక శ్రీవారిని త్వరగా దర్శించుకునేందుకు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇప్పుడు ఈ టికెట్లను భారతీయ రైల్వే కూడా తన ప్రయాణీకులకు అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) డివైన్ బాలాజీ దర్శన ప్యాకేజీ పేరుతో ఈ టికెట్లను అందిస్తోంది. ఈ టికెట్లను ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..


డివైన్ బాలాజీ దర్శన ప్యాకేజీ ప్రత్యేకత

తిరుపతిలో రైలు దిగిన తర్వాత ఒక రోజు ప్రత్యేక టూర్ కోసం IRCTC ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ధర రూ. 990. ఈ ప్యాకేజీలో భాగంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అందిస్తారు. తిరుపతి నుంచి తిరుమలకు, తిరుమల నుంచి తిరుపతికి ఎయిర్ కండిషన్డ్ బస్సు ప్రయాణం అందిస్తారు. తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత  తిరుచానూరులోని పద్మావతి ఆలయానికి తీసుకెళ్తారు. టూర్ గైడ్ సాయం అందిస్తారు. ఈ ప్యాకేజీని ఉపయోగించడానికి మీరు రైలులో ప్రయాణించాల్సిన అవసరం లేదు. బస్సు, విమానం లేదంటే కారు ద్వారా తిరుపతి చేరుకోవచ్చు.


రూ. 300 దర్శన టికెట్‌ ఎలా బుక్ చేసుకోవాలి?

⦿ ముందుగా www.irctctourism.com ఓపెన్ చేయండి.

⦿ వెబ్‌ సైట్‌ లో ‘ప్యాకేజీలు’, ‘తీర్థయాత్ర పర్యటనలు’ ఆప్షన్ ను ఎంచుకోండి.

⦿ తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే డివైన్ బాలాజీ దర్శన ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.

⦿ మీకు ఇష్టమైన తేదీ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి.

⦿  మీరు కొత్త వారైతే, మీ మొబైల్ నంబర్, ఇమెయిల్, ఇతర వివరాలతో అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

⦿ ఇప్పటికే IRCTC అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి.

⦿ మీ ఫోన్‌కు పంపిన OTPని ఎంటర్ చేయాలి.

⦿ ఎంత మంది వెళ్తున్నారో ఎంచుకోండి. బుకింగ్‌కు 6 టికెట్ల వరకు పొందే అవకాశం ఉంటుంది.

⦿ ప్రతి వ్యక్తి పేరు, వయస్సు, ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

⦿ అందుబాటులో ఉన్న దర్శన తేదీ, టైమ్ స్లాట్‌ ను ఎంచుకోండి.

⦿ ఒక్కో భక్తుడికి రూ. 990 ఛార్జ్ వసూళు చేస్తారు.

⦿ డెబిట్/ క్రెడిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు.

⦿ చెల్లింపు తర్వాత, మీకు ఇ-టిక్కెట్ లభిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.
ఈ టూర్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే?

ఈ టూర్ ప్యాకేజీ తీసుకున్న వాళ్లు ఉదయం 8:30 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్‌ ఫారమ్ నంబర్ 1కి చేరుకోవాలి. మీ ఇ-టిక్కెట్, IDని IRCTC సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది. తిరుమల వెళ్లడానికి అక్కడ IRCTC ఏర్పాటు చేసిన ఏసీ బస్సును ఉదయం 9:00 గంటలకు ఎక్కాలి. ఈ బస్సు నేరుగా శ్రీవారి దర్శనానికి తీసుకెళ్తుంది. దర్శనం తర్వాత సమయం ఉంటే పద్మావతి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తుంది. లేదంటే, నేరుగా తిరుపతికి తీసుకొస్తుంది.

 IRCTC టికెట్లు అందుబాటులో లేకుంటే ఏం చేయాలి? 

APSRTC: APSRTCకి సంబంధించిన www.apsrtconline.in లేదా www.abhibus.com లో బస్ ప్యాకేజీని బుక్ చేసుకోండి. వాళ్లు ప్రతిరోజూ 1,000 రూ. 300 టిక్కెట్లను అందిస్తారు.

TTD వెబ్‌ సైట్: ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోసం ttdevasthanams.ap.gov.inని చెక్ చేయాలి. 1–2 నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి.

ఉచిత దర్శనం: ఒకవేళ టికెట్ లేకుంటే ఉచిత దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోండి. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Read Also: ఆర్టీసీ ద్వారా కూడా తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చా? అదెలా?

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×