BIG TV LIVE Originals: రైళ్లలో ఆయా ప్రయాణ తరగతులు ఉన్నట్లుగానే విమానాల్లోనూ క్లాస్ లు ఉంటాయి. ముఖ్యంగా భారతీయ విమానాలలో ఎకానమీ క్లాస్, బిజినెస్ క్లాస్ ఉంటాయి. వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. ఇంతకీ ఏ క్లాస్ లో ఏ సౌకర్యాలు ఉంటాయి? ఏ క్లాస్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధర
⦿ ఎకానమీ క్లాస్: ధరలు చౌకగా ఉంటాయి. బడ్జెట్ ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి ముంబై వంటి దేశీయ విమాన టికెట్ ధర సుమారు రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఇండిగో, గో ఎయిర్ లాంటి విమానాలు బడ్జెట్ ఎయిర్ లైన్స్ గా గుర్తింపు పొందాయి.
⦿ బిజినెస్ క్లాస్: ధరలు ఎకానమీ క్లాస్ కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీ-ముంబై బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.15,000 – రూ.50,000 ఉంటుంది. ఎయిర్ ఇండియా, విస్తారా లాంటి ఫుల్ సర్వీస్ ఎయిర్ లైన్స్ బిజినెస్ క్లాస్‌ను అందిస్తాయి.
సీటింగ్, స్పేస్
⦿ ఎకానమీ క్లాస్: సీట్లు ఇరుకుగా ఉంటాయి. కాళ్లు పెట్టుకోవడానికి 28-32 ఇంచుల స్థలం ఉంటుంది. సీట్ వెడల్పు 17-18 ఇంచులు ఉంటుంది. సీట్లు రిక్లైన్ అయ్యే సామర్థ్యంసాధారణంగా 2-4 ఇంచెలు ఉంటుంది.
⦿ బిజినెస్ క్లాస్: సీట్లు విశాలమైనవి. సీట్ పిచ్ 38-60 ఇంచులు, వెడల్పు 20-22 ఇంచులు ఉంటుంది. సుదూర విమానాల్లో, సీట్లు ఫ్లాట్ బెడ్ లుగా మార్చబడతాయి. అదనపు లెగ్ రూమ్, ఫుట్ రెస్ట్‌లు, ప్రైవేట్ డివైడర్ లు ఉంటాయి.
సర్వీస్, సౌకర్యాలు
⦿ ఎకానమీ క్లాస్: బడ్జెట్ ఎయిర్ లైన్స్‌లో ఆహారం, డ్రింక్స్ కొనుగోలు చేయాలి. ఫుల్ సర్వీస్ ఎయిర్ లైన్స్ (ఎయిర్ ఇండియా, విస్తారా) ఉచిత భోజనం అందిస్తాయి. కానీ, సాధారణ మెనూ ఉంటుంది. ఇన్ ఫ్లైట్ ఎంటర్ టైన్ మెంట్ పరిమితంగా ఉంటుంది. దుప్పటి, దిండు మాత్రమే అందిస్తారు.
⦿ బిజినెస్ క్లాస్: ఉచిత గౌర్మెట్ భోజనం, ఆల్కహాలిక్/నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ , నచ్చిన ఆహారం పొందే అవకాశం ఉంటుంది. విస్తారాలో భారతీయ, కాంటినెంటల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. పెద్ద స్క్రీన్లతో హై క్వాలిటీ ఇన్ ఫ్లైట్ ఎంటర్ టైన్‌మెంట్, నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ ఉంటాయి. అమెనిటీ కిట్‌లు (టూత్‌బ్రష్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, స్లీప్ మాస్క్) ఉంటాయి. క్యాబిన్ సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధ వహిస్తారు.
బ్యాగేజీ అలవెన్స్
⦿ ఎకానమీ క్లాస్: దేశీయ విమానాల్లో 15-25 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీ, 7-8 కిలోల హ్యాండ్ బ్యాగేజీ, అంతర్జాతీయ విమానాల్లో 20-30 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీ, అదనపు బ్యాగేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
⦿ బిజినెస్ క్లాస్: దేశీయ విమానాల్లో 25-35 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీ, 10-12 కిలోల హ్యాండ్ బ్యాగేజీ.. అంతర్జాతీయ విమానాల్లో 30-40 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీ. అదనపు బ్యాగేజీపై డిస్కౌంట్ ఉంటుంది.
ఎయిర్ పోర్ట్ సౌకర్యాలు
⦿ ఎకానమీ క్లాస్: సాధారణ చెక్-ఇన్ కౌంటర్లు, క్యూలలో వేచి ఉండాలి. లాంజ్ యాక్సెస్ లేదు. బోర్డింగ్ లో ప్రాధాన్యత లేదు.
⦿ బిజినెస్ క్లాస్: ప్రాధాన్యత చెక్-ఇన్ కౌంటర్లు ఉంటాయి. వెయిటింగ్ తక్కువగా ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉంటుంది. ఉచిత ఆహారం, డ్రింక్స్ , Wi-Fi పొందే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత బోర్డింగ్, డీబోర్డింగ్ ఉంటుంది.
ఏ ఎయిర్ లైన్స్ లో ఏ సౌకర్యాలు?
⦿ ఎకానమీ క్లాస్: ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ లాంటి బడ్జెట్ ఎయిర్ లైన్స్ ఎకానమీ క్లాస్ పై దృష్టి పెడతాయి. ఎయిర్ ఇండియా, విస్తారా వంటి ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్ ఎకానమీలో మెరుగైన సేవలను అందిస్తాయి.
⦿ బిజినెస్ క్లాస్: ఎయిర్ ఇండియా, విస్తారా లాంటి ఎయిర్ లైన్స్ సుదూర దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో బిజినెస్ క్లాస్ అందిస్తాయి. బడ్జెట్ ఎయిర్ లైన్స్‌లో బిజినెస్ క్లాస్ లేదు.
ప్రయాణ అనుభవం
⦿ ఎకానమీ క్లాస్: రద్దీగా ఉంటుంది, ప్రైవసీ తక్కువ. సుదూర విమానాల్లో అసౌకర్యంగా అనిపింస్తుంది. సాధారణంగా స్వల్ప-దూర, బడ్జెట్ ప్రయాణాలకు అనుకూలం.
⦿ బిజినెస్ క్లాస్: లగ్జరీ, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం ఉంటుంది. వ్యాపారవేత్తలు, లగ్జరీ ప్రయాణీకులు ఈ క్లాస్ టికెట్లు తీసుకుంటారు. ఎక్కువ ప్రైవసీ, విశ్రాంతి, వ్యక్తిగత సేవలు పొందే అవకాశం ఉంటుంది.
ఏది ఎప్పుడు బెస్ట్ అంటే?
⦿ ఎకానమీ క్లాస్: తక్కువ దూర ప్రయాణాలు, బడ్జెట్ ప్రయాణీకులు, తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునేవారికి అనుకూలం.
⦿ బిజినెస్ క్లాస్: సుదూర దూర ప్రయాణాలు, వ్యాపారవేత్తలు, లగ్జరీ అనుభవం కోరుకునేవారు, ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి అనుకూలం.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఇక స్లీపర్ కోచ్ లోనూ ఏసీ బోగి సదుపాయాలు.. రైల్వే గ్రీన్ సిగ్నల్!