BigTV English

ESIC Jobs: 608 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,77,000.. వీళ్లందరూ అర్హులే..?

ESIC Jobs: 608 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,77,000.. వీళ్లందరూ అర్హులే..?
Advertisement

ESIC Jobs: ఎంబీబీఎస్ డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్ పాసైన అభ్యర్థులకు శుభవార్త అనే చెప్పవచ్చు.  ఈఎస్ఐసీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెడ్ క్వార్టర్స్.. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ డిస్పెన్సరీలు/ ఆస్పత్రుల్లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను డిటెయిల్‌డ్‌గా చూద్దాం.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 608


ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. (యూఆర్-254, ఎస్సీ-63, ఎస్టీ-53, ఓబీసీ-178, ఈడబ్ల్యూఎస్-60 చొప్పున ఉద్యోగాలు వేకన్సీ ఉన్నాయి.)

విద్యార్హత: ఎంబీబీఎస్ డిగ్రీ అర్హతతో పాటు.. రోటేటింగ్ ఇంటర్న్ షిప్ కంప్లీట్ అయి ఉండాలి. యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 డిస్ క్లోజర్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు చేసుకునేందుకు అర్హులు అవుతారు.

జీతం: రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంది.

వయస్సు: 2022 ఏప్రిల్ 4 నాటికి 35 ఏళ్ల వయస్సు దాటి ఉండకూడదు

దరఖాస్తు ముగింపు తేది: 2025 జనవరి 31

ఎంపిక విధానం: యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2022/2023 ఫలితాల్లో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.esic.gov.in/recruitments

Also Read: CSIR-CEERI Jobs: డిగ్రీ, డిప్లొమా పాసయ్యారా..? నెలకు స్టార్టింగ్ జీతమే.. రూ.57,000

జనవరి 31లోగా దరఖాస్తు ముగింపు తేది ఉంది. ఈ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి ఆల్ ది బెస్ట్.

Related News

Bank of Baroda Jobs: మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. లక్షకు పైగా జీతం, ఇంకా 10 రోజులే

SEBI: రూ.1,26,000 జీతంతో సెబీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు, ఉద్యోగం మీదే బ్రో

IPPB Executive: డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్.. ఐపీపీబీలో భారీగా ఉద్యోగాలు, స్టార్టింగ్ వేతనమే రూ.30వేలు

JEE Main 2026 Schedule: జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

RRC JOBS: ఇండియన్ రైల్వే నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్.. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు, డోంట్ మిస్

Constable Notification: 7565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. బంగారం లాంటి భవిష్యత్తు, ఇంకా 2 రోజులే..!

TGCAB Staff Assistant Posts: టీజీ క్యాబ్ బ్యాంకుల్లో 225 అసిస్టెంట్ పోస్టులు.. డిగ్రీ అర్హత గల వారికి గుడ్ ఛాన్స్

SSC Constable: ఇంటర్ పాసైతే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, ఇంకా 2 రోజులే

Big Stories

×