RRB Group-D Job: రైల్వేలో భారీగా గ్రూప్- డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 32వేలకు పైగా ఉద్యోగాల భర్తీ చేసేందుకు ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 22వ తేదీతో అప్లికేషన్ ప్రక్రియ ముగియనుంది. సికింద్రాబాద్ జోన్‌లో 1600కు పైగా పోస్టులున్నాయి.
టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు టెన్త్ పాస్‌తో పాటు ఎన్‌ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లోమా కోర్సులో తప్పనిసరిగా అర్హత పొంది ఉండాలని తొలుత ప్రకటించింది. దీనిలో మార్పు చేస్తూ తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC) కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్ఆర్‌బీ తెలిపింది. అయితే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి జులై 01, 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 ప్రారంభ వేతనం ఉంటుంది.
అయితే ఆర్ఆర్‌బీ గ్రూప్-డీ పరీక్షకు సంబంధించిన సెలబస్‌ను ఒకసారి చూద్దాం. RRB గ్రూప్-డీ పరీక్ష రాసే అభ్యర్థులు తప్పనిసరిగా RRB గ్రూప్ D సిలబస్‌ని పూర్తిగా పరిశీలించాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి. సీబీటె టెస్టులో 2025 మ్యాథ్స్, జీఎస్, జనరల్ సైన్స్, రీజనింగ్ వంటి ప్రశ్నలు ఉంటాయి. అంతేకాకుండా, అభ్యర్థులు పరీక్షలో అడిగే ప్రశ్నల సడిలిని తెలుసుకోవడానికి ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయవచ్చు.
NOTE: మొత్తం 100 ప్రశ్నలకు గానూ 90 నిమిషాల సమయం ఉంటుంది. నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఒక ప్రశ్న రాంగ్ సమాధానం అయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
మ్యాథ్స్:
RRB గ్రూప్ D మ్యాథ్స్ నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. మ్యాథ్స్ పరీక్ష కీలక పాత్రను పోషిస్తుంది. కొంచెం రోజు వారీగా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు చేయవచ్చు. సంఖ్యా వ్యవస్థ, బోడామస్, దశాంశాలు అండ్ భిన్నాలు, సగటు, కసాగు-గసాభా, శాతాలు, కాలం-పని, లాభ-నష్టాలు, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, వయస్సు మీద లెక్కలు, క్యాలెండర్, గడియారం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. మూడు నెలల పాటు రోజు వీటిపై సాధన చేస్తే 25 మార్కులకు గానూ 20 మార్కులు ఈజీగా సాధించవచ్చు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్:
గ్రూప్-డీ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు రావొచ్చు. కోడింగ్, డీకొడింగ్, రిలేషన్స్, జంబ్లింగ్, డేటా ఇంటర్ ప్రెటేషన్, ప్రకటనలు-వాదనలు, సిలాజజం, వెన్ డియాగ్ర్స్, తీర్మాణాలు-నిర్నయాలు, అనలిటికల్ రీజనింగ్, దిశలు నుంచి ప్రశ్నలు వస్తారు. రోజు వారీగా ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ మంచి మార్కులు చేయవచ్చు. ఇందులో బాగా సాధన చేస్తే 25 మార్కులు పొందవచ్చు.
జనరల్ సైన్స్:
జనరల్ సైన్స్ కోసం టెన్త్ క్లాస్ స్థాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ చదవాలి. ఫిజిక్స్ నుంచి 7-8 మార్కులు, కెమిస్ట్రీ నుంచి 9-10 మార్కులు, బయాలజీ నుంచి 6-7 మార్కులు వస్తాయి. టెన్త్ క్లాస్ స్థాయి పుస్తకాలు చదివితే మంచి మార్కులు పొందవచ్చు.
జనరల్ అవేర్‌నెస్:
జనరల్ అవేర్నెస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని 20 ప్రశ్నలు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, వ్యక్తులు, ఎకానమీ, పొలిటికల్ తదితర విషయాలపై ప్రశ్నలు అడుగుతారు. వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫైర్స్ చదివితే మంచి స్కోర్ చేయవచ్చు.
Also Read: ESIC Jobs: 608 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,77,000.. వీళ్లందరూ అర్హులే..?
పై సిలబస్ ను రెండు, మూడు సార్లు రివిజన్ చేసి చదవిండి. బాగా చదవండి. మీకు ఉద్యోగం రావాలని ఆశిస్తూ.. మీ బిగ్ టీవీ.. ఆల్ ది బెస్ట్.